Home » ఒకప్పటి టాప్ హీరోయిన్ మాలశ్రీ ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..!

ఒకప్పటి టాప్ హీరోయిన్ మాలశ్రీ ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..!

by AJAY
Ad

ఒక‌ప్పుడు తెలుగు తెర పై వెలుగు వెలిగిన చాలా మంది ముద్దుగుమ్ములు ప్రస్తుతం క‌నిపించ‌కుండా పోయారు. అలాంటి అందాల తార‌ల‌లో న‌టి మాల‌శ్రీ కూడా ఒక‌రు. మాల‌శ్రీ ఒక‌ప్పుడు కుర్రాళ్ల క‌ల‌ల హీరోయిన్ గా రానించింది. మాల‌శ్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌వ్ స్టోరీ చిత్రం ప్రేమఖైదీ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఇవివి స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Also Read:  వీరసింహా రెడ్డి లో నటించిన వరలక్ష్మి కి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా ? హీరో కంటే ఎక్కువా..?

Advertisement

 

ఈ సినిమాను డి రామానాయుడు నిర్మించారు. కాగా తెలుగులో సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమాలో త‌న అందం అభిన‌యంతో మాల‌శ్రీ ఆక‌ట్టుకుంది. మాలశ్రీ అస‌లు పేరు శ్రీదుర్గ కాగా సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర‌వాత త‌న పేరును మార్చుకుంది. ఈ సినిమా త‌ర‌వాత మంచి గుర్తింపు రావ‌డంతో త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల‌లో న‌టించారు.

Also Read: బాలయ్య డైరెక్టర్ కు ఖరీదైన బహుమతి ఇచ్చిన చిరంజీవి… ఎందుకో తెలుసా..?

Advertisement

మాల‌శ్రీ నటించిన సాగర క‌న్య‌, పోలీస్ అల్లుడు, సూర్య‌పుత్రులు, బావ బావమ‌రిది సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ఇక సినిమాల ప‌రంగా స‌క్సెస్ ను చూసిన మాల‌శ్రీ జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. మాల‌శ్రీ త‌ల్లి ఆమె మొద‌టి సినిమా విడుద‌లైన కొన్ని రోజుల‌కే రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఇక మాల‌శ్రీ సినిమాల‌లో న‌టిస్తున్న స‌మ‌యంలో స‌హ‌న‌టుడు సునీల్ తో ప్రేమ‌లో ప‌డింది.

అత‌డినే వివాహం కూడా చేసుకుంది. అయితే వీరిద్దరూ కారులో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆ ప్ర‌మాదంలో సునీల్ మ‌ర‌ణించ‌గా మాల‌శ్రీ గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ త‌ర‌వాత కొన్నేళ్ల‌కు మాల‌శ్రీ నిర్మాత రామును వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప జ‌న్మించింది. కాగా ఒక‌ప్పటి ఈ స్టార్ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దాంతో మాల‌శ్రీ ఇంత‌లా మారిపోయిందా అని చూసి నెటిజ‌న్ లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Also Read: “చెన్న‌కేశ‌వరెడ్డి” సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డానికి అసలు కార‌ణం ఏంటి..? వినాయక్ చెప్పింది ఇదే..?

Visitors Are Also Reading