Home » “చెన్న‌కేశ‌వరెడ్డి” సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డానికి అసలు కార‌ణం ఏంటి..? వినాయక్ చెప్పింది ఇదే..?

“చెన్న‌కేశ‌వరెడ్డి” సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డానికి అసలు కార‌ణం ఏంటి..? వినాయక్ చెప్పింది ఇదే..?

by AJAY
Ad

మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ సినిమాలు చేయాలంటే టాలీవుడ్ లో బాల‌య్య త‌ర‌వాత‌నే మ‌రెవ‌రైనా. కేవ‌లం టాలీవుడ్ మాత్ర‌మే కాదూ బాలీవుడ్ లో కూడా బాల‌య్య రేంజ్ మాస్ సినిమాలు చేసే హీరో లేడ‌నే చెప్పాలి. ఇక డైలాగులు చెప్ప‌డం అయినా తొడ‌లు కొట్ట‌డం అయినా బాలయ్య త‌ర‌వాత‌నే ఎవ‌రైనా. సినిమాలో బాల‌య్య ఫైట్ లు చేస్తేనే ప్రేక్ష‌కులు కుషీ అవుతారు.

Chennakesava Reddy

Chennakesava Reddy

బాల‌య్య సినిమాలు డైలాగులు ఫైట్ లు లేవంటే నిరాశ‌ప‌డతారు. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య ఎక్కువ‌గా మాస్ మాసాల సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఇక బాల‌య్య కెరీర్ లో వ‌చ్చిన మాస్ ఓరియంటెడ్ చిత్రాల‌లో చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా ఒక‌టి. అయితే ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఫ్లాప్ అయ్యింది.

Advertisement

Advertisement

ఈ సినిమాకు వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ బాల‌య్య అభిమానుల‌కు మాత్రం తెగ‌న‌చ్చేసింది. కాగా ఈ సినిమా గురించి ఓ ఇంట‌ర్వ్యూలో వివి వినాయ‌క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో అర్థం కాలేద‌ని అన్నారు.

కానీ ఈ సినిమా బాల‌య్య అభిమానుల‌కు మాత్ర‌మే కాకుండా సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు కూడా న‌చ్చింద‌ని అన్నారు. ఇప్ప‌టికీ కూడా బాల‌య్య త‌న‌కు ఎదురుప‌డితే స‌త్తిరెడ్డి పేల్చు అంటూ మాట్లాడ‌తార‌ని చెప్పారు. ఆ త‌ర‌వాత బాల‌య్య సి క‌ల్యాణ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రావాల్సి ఉంద‌ని కానీ కుద‌ర‌లేద‌ని అన్నారు. చెన్న‌కేశ‌రెడ్డికి ప్లాప్ టాక్ వ‌చ్చినా బాల‌య్య‌తో త‌న కాంబినేష‌న్ హిట్ అని అన్నారు.

Also read :తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త.. కార్తీకదీపం 2 సీరియల్ త్వరలోనే..!

Visitors Are Also Reading