Home » ఒకేఒక్కడు క‌థ‌ను ర‌జీనీ కోసం రాసుకుంటే ఆయ‌న ఎందుకు రిజెక్ట్ చేశారు..? తెర వెన‌క ఇంత జ‌రిగిందా..?

ఒకేఒక్కడు క‌థ‌ను ర‌జీనీ కోసం రాసుకుంటే ఆయ‌న ఎందుకు రిజెక్ట్ చేశారు..? తెర వెన‌క ఇంత జ‌రిగిందా..?

by AJAY
Ad

ఇప్పుడు దేశ‌మంత‌టా బెస్ట్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే రాజ‌మౌళి పేరు వినిపిస్తుంది. కానీ ఒక‌ప్పుడు బెస్ట్ డైరెక్టర్ ఎవ‌ర‌ని అడిగితే ద‌ర్శ‌కుడు శంక‌ర్ పేరు వినిపించేది. త‌మిళ డైరెక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ శంక‌ర్ త‌న సినిమాల‌తో దేశవ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. పాన్ ఇండియా పేరు లేనప్పుడే శంక‌ర్ పాన్ ఇండియాను షేక్ చేశారు.

Also Read:  2022లో నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకువచ్చిన సినిమాలు ఇవే…!

Advertisement

 

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో భార‌తీయుడు సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా త‌ర‌వాత శంక‌ర్ ఓ పొలిటిక‌ల్ డ్రామాను తెర‌కెక్కించాల‌ని అనుకున్నాడు. ఆ సినిమానే ఒకే ఒక్క‌డు. ఒక్క‌రోజు సీఎం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వ‌చ్చింది. అయితే ఈ సినిమాను శంక‌ర్ మొద‌ట ర‌జినీకాంత్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడు.

Advertisement

అయితే భార‌తీయుడు త‌ర‌వాత మ‌ళ్లీ సోష‌ల్ ఎవేర్నేస్ సినిమా అంటే ప్రేక్ష‌కుల‌కు బోర్ కొడుతుందేమో అని ఆ స్క్రిప్ట్ ను ప‌క్క‌న పెట్టి జీన్స్ సినిమాను తెర‌కెక్కించాడు. ఆ సినిమా త‌ర‌వాత ఒకేఒక్క‌డు స్క్రిప్ట్ ను తిరిగిప‌ట్టుకున్నాడు. ఈ సినిమా క‌థను పూర్తి చేసి శంక‌ర్ హీరో ర‌జినీకాంత్ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. క‌థ విన్న త‌ర‌వాత ర‌జినీకాంత్ ఈ సినిమా పూర్తిగా సీఎం కు వ్య‌తిరేకంగా అవుతుంది..కాబ‌ట్టి నేను చేయ‌ను వేరే క‌థ అయితే చేస్తాను అని చెప్పాడు. దాంతో శంక‌ర్ అదే క‌థ‌ను ఎలాగైనా సినిమా చేయాల‌ని క‌మ‌ల్ హాస‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు.

Also Read: సినిమాల కంటే ఓటీటీ లోనే ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్ వీరే..!

Kamal hasan

Kamal hasan

క‌మ‌ల్ హాస‌న్ వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఈ సినిమా చేయ‌లేక‌పోయాడు. అయితే ఆ త‌ర‌వాత శంక‌ర్ విక్ట‌రీ వెంక‌టేష్ ను కూడా సంప్ర‌దించారు అని అప్ప‌ట్లో టాక్ వినిపించింది కానీ దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఆ త‌ర‌వాత శంక‌ర్ ఈ క‌థ‌ను అర్జున్ కు చెప్ప‌గా అర్జున్ ఒప్పుకున్నారు. అర్జున్ ఒప్పుకోవ‌డంతో ఈ సినిమా ప‌ట్టాలెక్కింది. అంతే కాకుండా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

Also Read:   సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ల రెమ్యునరేషన్స్….ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారంటే…?

Visitors Are Also Reading