Home » 2022లో నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకువచ్చిన సినిమాలు ఇవే…!

2022లో నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకువచ్చిన సినిమాలు ఇవే…!

by AJAY
Published: Last Updated on
Ad

ప్రతి ఏడాది కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ లు అయితే మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అలా 2022 సంవత్సరంలో కూడా కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే… మరికొన్ని సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచాయి. ఆ సినిమాలు డిజాస్టర్ గా నిలవడం వల్ల నిర్మాతలు దారుణంగా నష్టపోయారు. అలా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….

Advertisement

 

మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ చిరంజీవి ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో 90 కోట్ల నష్టాలు వచ్చాయి.

Advertisement

అంతేకాకుండా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా లైగర్…ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో నిర్మించారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి చార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు 62 కోట్ల నష్టాలు వచ్చాయి.

అంతేకాకుండా రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా ది వారియర్… ఈ సినిమాలో అసలు లాజిక్ లు లేకపోవడం… సినిమాపై అంచనాలు ఉండటంతో ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి ఏకంగా 18 కోట్ల నష్టాలు వచ్చాయి.

the ghost

the ghost

అంతేకాకుండా నాగార్జున హీరోగా నటించిన సినిమా ది గోస్ట్ సినిమా కాప్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సైతం నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాకు ఏకంగా 17 కోట్ల నష్టాలు వచ్చాయి.

Visitors Are Also Reading