Home » NTR : ఎన్టీఆర్ కు యాక్టింగ్ లో శిక్షణ ఇచ్చింది ఎవరో తెలుసా?

NTR : ఎన్టీఆర్ కు యాక్టింగ్ లో శిక్షణ ఇచ్చింది ఎవరో తెలుసా?

by Bunty
Published: Last Updated on

NTR : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే స్టార్ డం వస్తుంది. అలా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి కుటుంబ వారసత్వాన్ని అందుకొని.. ఇండస్ట్రీలో తన సత్తా చూపించాడు. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి లాంటి బంపర్ విజయాలను తన కెరీర్ ప్రారంభంలోనే అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

ntr trainer is actor bhikshu

ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కు యాక్టింగ్ నేర్పించిన వ్యక్తి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కు యాక్టింగ్ నేర్పించింది భిక్షు. బాల రామాయణం సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ 10 సంవత్సరాల వయసులో తన దగ్గర శిక్షణ తీసుకున్నాడని వివరించారు భిక్షు. తన దగ్గర ట్రైనింగ్‌ తీసుకునే వారి నుంచి ఎక్కువగా డబ్బులు కూడా వసూలు చేయనని చెప్పాడు. జనతా గ్యారేజీ సినిమాలో తాను ఓ పాత్రలో ఉన్నానని బిక్షు చెప్పుకొచ్చాడు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading