Home » ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 బ్లాక్ బస్టర్ సినిమాలు…ఈ సినిమాలు గనక చేసి ఉంటే..!

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 బ్లాక్ బస్టర్ సినిమాలు…ఈ సినిమాలు గనక చేసి ఉంటే..!

by AJAY
Ad

కొన్నిసార్లు హీరోలు కథ నచ్చకపోవడం వలనో డేట్స్ సర్దుబాటు కావడం లేదనో తమ వద్దకు వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తారు. అలా రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు మరో హీరో చేసి సూపర్ హిట్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

Also Read: వివి.నాయక్ ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన ఆ చిత్రానికి కొడాలి నాని ఎందుకు అడ్డుపడ్డారు…. ఇంట్రెస్టింగ్ స్టోరీ….!

Advertisement

 

అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసి నష్టపోయారు. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆరు సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ నే మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాతే బన్నీ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాను సుకుమార్ మొదటగా ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేయడంతో ఆఫర్ బన్నీకి వెళ్లింది.

Also Read: ముంబై వదిలేయడంతో షాక్ లోకి పాండ్య..!

సిద్ధార్థ్ జెనీలియా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా కథ కూడా మొదట ఎన్టీఆర్ వద్దకే వచ్చింది కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.

Advertisement

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ, ఇలియాన హీరో హీరోయిన్లు నటించిన సినిమా కిక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా మొదట ఎన్టీఆర్ వద్దకే వెళ్ళింది. కానీ ఎన్టీఆర్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.

Dil Movie

Dil Movie

Also Read: ప్రభాస్ ఫామ్ హౌస్ ల విలువ అంతా…?

నితిన్ హీరోగా తెరకెక్కిన దిల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే నిర్మాత దిల్ రాజుకు ఎంతో పేరు వచ్చింది. ఇక సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా కూడా మొదట ఎన్టీఆర్ కు వచ్చింది. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో నితిన్ వద్దకు వెళ్ళింది.


రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమా ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఇక ఈ సినిమా కూడా మొదట ఎన్టీఆర్ వద్దకు వెళ్లగా ఆయన రిజెక్ట్ చేశారట. దాంతో ఆ ఆఫర్ రవితేజను వరించింది.

Oopiri Movie

Oopiri Movie

నాగార్జున కార్తీ హీరోలుగా ఊపిరి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో కార్తీ పాత్ర కోసం ఎన్టీఆర్ ను సంప్రదించారు. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఆఫర్ కార్తీ వద్దకు వెళ్ళింది.

Also read :విజయ్ దేవరకొండ “లైగర్” సినిమా కథ ఇదేనట…..? సోషల్ మీడియాలో వైరల్….!

Visitors Are Also Reading