Home » ముంబై వదిలేయడంతో షాక్ లోకి పాండ్య..!

ముంబై వదిలేయడంతో షాక్ లోకి పాండ్య..!

by Azhar
Ad

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన 15 సీజన్ల ఐపీఎల్ లో 5 సార్లు ముంబై ఇండియన్స్ టైటిల్ అనేది గెలుచుకుంది. కానీ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2022 లో మాత్రం ముంబై చాలా చెత్త ప్రదర్శన అనేది చేసింది. ఆ జట్టు ఏడాది లీగ్ లో మొదటి విజయం అనేది సాధించడానికి 8 మ్యాచ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. దాంతో కేవలం ముంబై అభిమానులు మాత్రమే కాదు. మొత్తం ఐపీఎల్ అభిమానులు కూడా ముంబై ఇండియన్స్ ప్రదర్శన అనేది చూసి షాక్ అయ్యారు.

Advertisement

అయితే ముంబై ఇండియన్స్ ఈ ఏడాది అంతలా ఓడిపోవడానికి కారణం.. జట్టు అనేది సరిగ్గా లేకపోవడం. ఐపీఎల్ 2022 లోకి కొత్త జట్లు రావడంతో బీసీసీఐ మెగవేలం అనేది నిర్వహించింది. అందులో భాగంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే తమతో ఉంచుకొని మిగితావారిని వేలానికి వదిలేయాల్సి వచ్చింది. కానీ వదిలేసిన ఆటగాల్లో అందర్నీ మళ్ళీ తిరిగి ఈ జట్టు అనేది కొనుగోలు చేయలేకపోయింది. అయితే ముంబై సాధించిన 5 టైటిల్స్ విజయాలలో నాలుగు విజయాలలో ముఖ్యపాత్ర అనేది పోషించాడు భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య. కానీ ఈ ఐపీఎల్ ముందు అతను ఫిట్ లేకపోవడంతో ముంబై అతడిని వేలంలోకి వదిలేసింది.

Advertisement

ఇక జట్టు యొక్క ఈ చర్యతో హార్దిక్ షాక్ కు గురయ్యాడు అని తాజాగా భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ…. పాండ్య ఆల్ రౌండర్ గానే కాకుండా.. కెప్టెన్ గా ఉంటె అద్భుతమైన ప్రదర్శన అనేది కనబరుస్తాడు. అయితే ముంబైలో చాలామంది స్టార్ ఆటగాళ్లు ఉండటం వల్ల వారు పాండ్యను వదిలేయడంతో అతను చాలా ఆశ్చర్యపోయాడు. కానీ తర్వాత గుజరాత్ జట్టులోకి వెళ్ళాడు. వారు పాండ్యను కెప్టెన్ గా నియమించారు. దాంతో అతనిలోని మరో కోణం అనేది బయటకు వచ్చింది అని రవిశాస్త్రి తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ కెరియర్ నాశనం చేస్తున్న బీసీసీఐ..!

బాబర్ మెసేజ్ పై స్పందించిన విరాట్ కోహ్లీ..!

Visitors Are Also Reading