Home » JR NTR : ఎన్టీఆర్ జాతకం ప్రకారం టీడీపీ లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోయేది ఆ సంవత్సరమే నట ! ఎప్పుడంటే ?

JR NTR : ఎన్టీఆర్ జాతకం ప్రకారం టీడీపీ లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోయేది ఆ సంవత్సరమే నట ! ఎప్పుడంటే ?

by AJAY
Ad

ఎన్టీ రామారావు తర్వాత నందమూరి ఫ్యామిలీ లో అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాత పేరు తో పాటు ఎన్టీఆర్ ఆయన అందాన్ని నటన సామర్థ్యాన్ని కూడా వారసత్వం గా అందుకున్నారు. టాలీవుడ్ లోనే గొప్ప నటులుగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాణిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో కూడా ఎన్టీఆర్ తనలోని నటనను పాన్ ఇండియాకు రుచి చూపించారు.

Advertisement

దాంతో ఎన్టీఆర్ నటనకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించాలని కొందరు నందమూరి నందమూరి అభిమానులు టిడిపి కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తేనే టిడిపి బలపడుతుందని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్పట్లో తాను రాజకీయాల్లోకి రానని అనేక సందర్భాల్లో చెప్పారు.

Advertisement

అంతేకాకుండా రాజకీయాల గురించి అడిగితే ఆ ప్రశ్నలను దాటవేస్తున్నారు. రీసెంట్ గా కూడా ఎన్టీఆర్ ప్రస్తుతం తాను నటనలోనే కొనసాగుతున్నానని నటనతోనే సంతోషంగా ఉన్నాన‌ని చెప్పారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జాతకం చూసిన ప్రముఖ జ్యోతిష్యులు నంది శ్రీహరి శర్మ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సినిమాల పరంగా ఎన్టీఆర్ కు 2033 వ‌ర‌కు తిరుగు లేదని చెప్పారు. 2033 వరకు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా ఎన్టీఆర్ ఉంటారని చెప్పారు. అంతేకాకుండా ఎన్టీఆర్ జాతకం ప్రకారం 2034 లో అనుకోని పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోకి వస్తారని అన్నారు. ఇక జ్యోతిష్యులు చెప్పిన మాట‌ల‌తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా సీఎం ఎన్టీఆర్ అంటూ ట్రెండింగ్ లోకి తీసుకు వచ్చారు.

ఇవి కూడా చదవండి:కిర్రాక్ గా ఆర్పీ ల‌గ్జ‌రీ ఇల్లు….హోం థియేట‌ర్ తో పాటూ ఇంటి స్పెషాలిటీలు ఇవే..! 

ఇవి కూడా చదవండి: శ్రీ‌దేవి త‌ల్లి రాజేశ్వ‌రి సినిమాల్లో న‌టించిన విష‌యం మీకు తెలుసా..?

Visitors Are Also Reading