Home » కిర్రాక్ గా ఆర్పీ ల‌గ్జ‌రీ ఇల్లు….హోం థియేట‌ర్ తో పాటూ ఇంటి స్పెషాలిటీలు ఇవే..!

కిర్రాక్ గా ఆర్పీ ల‌గ్జ‌రీ ఇల్లు….హోం థియేట‌ర్ తో పాటూ ఇంటి స్పెషాలిటీలు ఇవే..!

by AJAY
Ad

జ‌బర్ద‌స్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో కిర్రాక్ ఆర్పీ కూడా ఒక‌రు. ఆర్పీ మొద‌ట కమెడియ‌న్ గా జ‌బ‌ర్ద‌స్త్ లోకి వ‌చ్చి ఆ త‌ర‌వాత టీమ్ లీడ‌ర్ వ‌ర‌కూ ఎదిగాడు. ప్ర‌స్తుతం ఆర్పీ ప‌లు టీవీ షోల‌తో పాటూ ఈవెంట్ లతో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా సినిమాల్లోనూ కిర్రాక్ ఆర్పీ అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటున్నారు. కిర్రాక్ ఆర్పీ త‌నదైన యాస‌తోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఇదిలా ఉండ‌గా ఆర్పీ మ‌రోవైపు యూట్యూబ్ ఛానల్ తెర‌చి వీడియోలు కూడా చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌న యూట్యూబ్ ఛాన‌ల్ లో ప‌లువీడియోలు చేశారు. కాగా తాజాగా ఆర్పీ త‌న హోం టూర్ వీడియోను కూడా యూట్యూబ్ లో షేర్ చేశారు. వీడియోలో ఆర్జీ ల‌గ్జ‌రీ ఇంటిని క‌ట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. మొద‌ట ఇంటిని ఆర్పీ బ‌య‌ట నుండి చూపించారు. కాగా ఈ ఇల్లు ఎంతో అందంగా క‌నిపిస్తుంది. ఇంట్లోకి వెళ్ల‌గానే ఆర్పీ త‌మ ఇంటి హాల్ ను చూపించాడు.

Advertisement

Advertisement

ఇంట్లో విశాల‌మైన హాల్ తో పాటూ ఇంటీరియ‌ర్ ఆక‌ట్టుకునేవిధంగా ఉంది. ఇక ఆ త‌ర‌వాత ఇంట్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను కూడా చూపించాడు. కింద ఫ్లోర్ లో త‌న త‌ల్లి దండ్రుల కోసం బెడ్ రూమ్ లు క‌ట్టించాన‌ని చెప్పాడు. ఆ త‌ర‌వాత త‌న సోద‌రుడి గ‌దిని చూపించారు. ఇక ఆ త‌ర‌వాత త‌న బెడ్ రూమ్ చూపించాడు. త‌న బెడ్ రూమ్ ను త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా డిజైన్ చేయించుకున్నాన‌ని తెలిపాడు.

అంతే కాకుండా త‌న బెడ్ లో ఉన్న త‌న కాబోయే భార్య ఫోటోను కూడా ఆర్పీ చూపించారు. త‌ను ఆ అమ్మాయిని ప్రేమించిన వెంట‌నే మొద‌ట త‌న‌కు ఇష్ట‌మైన నాగ‌బాబు గారికి చూపించా అని చెబుతూ ఆయ‌న తో దిగిన ఫోటోను చూపించారు. వ‌చ్చే నెల‌లోనే త‌న ఎంగేజ్మెంట్ ఉంటుంద‌ని ఆర్పీ స్ప‌ష్టం చేశారు.ఇక ఆర్పీ హోం టూర్ వీడియో ప్ర‌స్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

Visitors Are Also Reading