విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహా నటుడిగానే కాకుండా.. మహా నాయకుడిగా కూడా కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు. నటుడుగా ఎన్నో పాత్రలు వేసి దేశవ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకున్నారు. తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజాసేవకు సమర శంఖం పూరించారు ఎన్టీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా సేవలందించారు. తన సొంత కుటుంబం కంటే ఎక్కువ ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఎన్టీఆర్.
Also Read : టైగర్ 3లో సల్మాన్, షారుక్ ఫైట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?
Advertisement
ఎన్టీఆర్ కి 12 మంది సంతానం. వారిలో 8 మంది కొడుకులు, నలుగురు కూతుర్లు. ఎన్టీఆర్ కి ఆరోవ సంతానం నందమూరి బాలకృష్ణ, ఏడో సంతానం రామకృష్ణ. వీరిద్దరికీ కూడా ఒకేసారి పెళ్లి జరిగింది. 1982 లో డిసెంబర్ 8న తిరుపతిలో వీరి వివాహం జరిగింది. ఎన్టీఆర్ ఇద్దరు కొడుకుల వివాహం ఒకేరోజు జరిగినప్పటికీ.. ఎన్టీఆర్ హాజరు కాకపోవడం గమనార్హం. ఇద్దరు కొడుకుల పెళ్లి జరుగుతున్నప్పటికీ ఎన్టీఆర్ హాజరు కాకపోవడానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నారా..? అదే ప్రజాయాత్ర.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రవంతటా ఎన్టీఆర్ క్యాంపెయిన్ చేస్తున్న సమయంలోనే బాలకృష్ణ వివాహం జరిగింది.
Advertisement
వీరి పెళ్లికి వెళ్లినట్టయితే యాత్రకు విరామం ఇవ్వాల్సి వస్తుందని ఎన్టీఆర్ పెళ్లికి వెళ్లడమే మానేశారట. వీరిద్దరూ కూడా ఎన్టీఆర్ వద్దకే వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారట. ఈ విషయాన్ని ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఓ వేదికపై నటుడు మురళీమోహన్ వెల్లడించారు. మే 28, 2022 నుంచే ‘శకపురుషుని శతజయంతి’ ఉత్సవాలంటూ నందమూరి బాలకృష్ణ సంవత్సరాది వేడుకలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల విజయవాడలో నిర్వహించిన శతజయంతి అంకురార్పణ సభ కి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం విధితమే. ఏదీ ఏమైనప్పటికీ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యుల కంటే ప్రజల కోసం ఎక్కువ సమయం కేటాయించారు అనడంలో ఉదాహరణ బాలకృష్ణ పెళ్లి అనే చెప్పవచ్చు.