Home » ఆ పాత్రను తలుచుకుంటే నాకు ఇప్పటికీ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి… రాఘవేంద్రరావు..!

ఆ పాత్రను తలుచుకుంటే నాకు ఇప్పటికీ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి… రాఘవేంద్రరావు..!

by AJAY

టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి సంతోష్ శోభన్ ప్రస్తుతం వరుస మూవీలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతి కనుకగా జనవరి 14వ తేదీన విడుదల అయినటువంటి “కళ్యాణం కమనీయం” అనే మూవీతో ఈ యువ హీరో ప్రేక్షకులను పలకరించాడు.

యువి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా మేప్పించలేకపోయింది. ఇలా కల్యాణ కమనీయం మూవీతో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఈ యువ హీరో తాజాగా “అన్ని మంచి శకునములే” అనే సినిమాలో హీరోగా నటించాడు.

ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా… మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేసింది. ఈ పాట విడుదల కార్యక్రమానికి రాఘవేంద్రరావు, అశ్విని దత్, అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ పాట విడుదల కార్యక్రమంలో భాగంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ … దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా హను రాగవపూడి దర్శకత్వంలో రూపొందిన సీతా రామం మూవీపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సీతను తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. త్వరలోనే సీతా రామం మూవీకి పార్ట్ 2 ప్లాన్ చేయాలి అని సూచన ఇచ్చాడు.

Visitors Are Also Reading