టాలీవుడ్ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ పేరుకు ఓ ప్రత్యేకస్థానముంది. ఒకప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇప్పుడు యంగ్ టైగర్ తారక్ వీరిద్దరి గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది. అంతటి పేరును, అభిమానులను సంపాదించుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని మాత్రమే కాదు. నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని, తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. తన చిన్నతనంలోనే బాలరామాయణంలో నటించి అందరి వద్ద శభాష్ అనిపించుకున్నారు ఎన్టీఆర్.
Advertisement
Also Read: ఎన్టీఆర్ తొక్కకుండా ఉండడం వల్లనే చిరు ఈ స్థాయిలో ఉన్నాడా..?
ఇప్పుడు కూడా డిఫరెంట్ మూవీలలో సినిమాల్లో నటిస్తూ.. తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. సినిమా సినిమాకు తనలోని డిఫరెంట్ షేడ్స్ అభిమానులకు చూపిస్తూ టాప్ హీరోల లిస్ట్ ఒక్కడిగా ఉన్నాడు. ఎన్టీఆర్ లక్ష్మిప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసినదే. చూడడానికి చక్కని రూపం, భర్త పేరు నిలబెట్టే విధంగా తెలుగు ఇంటి సాంప్రదాయాలను ఫాలో అవుతూ ఎప్పుడు నిండైన బట్టలతో ఆమెను చూస్తే నమస్కరించాలనిపించే ఉంటుది. నో సోషల్ మీడియా, నో ఎక్స్‌పోజింగ్, నో కాంట్రవర్సీ, ఓన్లీ ఫ్యామిలీనే తన సర్వస్వం. పిల్లలే తన ప్రాణం అంటూ అచ్చం తెలుగింటి గృహిణిలా ఉంటుంది లక్ష్మిప్రణతి.
Advertisement
Advertisement
పెళ్లి అయిన కొత్తలో ప్రణతి ఎన్టీఆర్‌ను ఓ ప్రశ్న అడిగిందట. ఆ ప్రశ్న ఆల్ మోస్ట్ అందరూ భార్యలు వాళ్ల భర్తలను అడిగే ఉంటారు. నీకు మా ఇద్దరిలో ఎవ్వరు అంటే ఎక్కువ ఇష్టం. మీ అమ్మగారు, నేనా..? ఈ ప్రశ్న ఏదో ఒక సందర్భంలో ప్రతీ భర్తకు ఎదురై ఉంటుంది. కూల్‌గా ఉండే భర్తలయితే ఇద్దరు సమానమే. కోపంగా ఉండే వారు అయితే నీకు వేరే పని లేదా పక్కకు పో.. తెలివైన భర్త అయితే నువ్వే అని ఆన్సర్ ఇస్తుంటాడు. ఎన్టీఆర్ మాత్రం నాకు మా అమ్మనే ఇష్టం. ఆ తరువాత నువ్వు నాలైఫ్‌లోకి వచ్చావు. నిన్ను మా అమ్మ అంతగా ఇష్టపడుతున్నాను. అయితే భార్యను ప్రేమించేవాడు తల్లిని ప్రేమిస్తాడో లేదో తెలియదు. కానీ తల్లిని ప్రేమించే ప్రతీ భర్త భార్యలో అమ్మను చూసుకుంటాడు అని చెప్పాడు. ప్రణతి ఎమోషనల్ గా ఫీల్ అయిపోయిందట.
Also Read: బ్రేకింగ్: థమన్‌కి కరోనా పాజిటివ్