Home » బ్రేకింగ్‌: థ‌మ‌న్‌కి క‌రోనా పాజిటివ్

బ్రేకింగ్‌: థ‌మ‌న్‌కి క‌రోనా పాజిటివ్

by Anji
Ad

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం అంద‌రికీ క‌రోనా సోకుతుంది. నిన్న మంచుల‌క్ష్మీ, మ‌హేష్‌బాబుల‌కు క‌రోనా పాజిటివ్ రాగా.. ఇవాళ తాజాగా సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌కు కూడా కొవిడ్‌-19సోక‌డం టాలీవుడ్‌లో అంద‌రూ భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే వ్యాక్సిన్ తీసుకోని వారికి మ‌రింత ముప్పు ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, వీలు అయినంత త్వ‌ర‌గా అంద‌రూ వ్యాక్సిన్లు తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు.

Advertisement

Producers Know What I Should Be Paid: SS Thaman

Advertisement

రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారు సైతం జాగ్ర‌త్త వ‌హించి త‌ప్ప‌కుండా క‌రోనా నిబంద‌న‌లు పాటించాల‌ని సూచిస్తున్నారు. థ‌మ‌న్‌కు క‌రోనా సోకింద‌ని తెలిసిన ప‌లువురు ప్రేక్షకాభిమానులు, సినీ ప్ర‌ముఖులు త్వ‌ర‌గా కోలుకుని అంద‌రికీ జోష్ నింపాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుతున్నారు. థమన్ కి కరోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని కొద్దిసేపటి క్రితం ఈ వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురైంది.

Visitors Are Also Reading