Telugu News » Blog » హైద‌రాబాద్‌లో నోరో వైర‌స్ క‌ల‌క‌లం.. చిన్న పిల్ల‌లు జాగ్ర‌త్త‌..!

హైద‌రాబాద్‌లో నోరో వైర‌స్ క‌ల‌క‌లం.. చిన్న పిల్ల‌లు జాగ్ర‌త్త‌..!

by Anji
Ads

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని న‌గ‌ర‌మైన‌టువంటి హైద‌రాబాద్లో నోరో వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఐదేళ్ల‌లోపు చిన్నారుల‌కు ఈ వైర‌స్ అధికంగా సోకుతున్న‌ట్టు తెలుస్తోంది. ఐదేళ్ల‌లోపు ఉన్న ఐదుగురు చిన్నారుల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో గుర్తించారు. గాంధీ హాస్పిట‌ల్, ఎల్లా ఫౌండేష‌న్ కు చెందిన ప‌రిశోధ‌కులు నోరో వైరస్ గురించి వెల్ల‌డించారు. ముఖ్యంగా పీడియాట్రిక్, గ్యాస్ట్రోఎంటెరిటిస్ రోగుల్లో నోరో వైర‌స్ ఎక్కువ‌గా క‌నిపించింద‌ని తెలిపారు.

నోరో వైర‌స్ అన్ని వ‌య‌సుల వారిలో తీవ్ర‌మైన విరేచ‌నాల‌కు కార‌ణం అవుతాయి. ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు సంభ‌వించ‌డంతో మైక్రో బ‌యాల‌జిస్టులు న‌గ‌రంలో ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌లో నోరో వైర‌స్ విష‌యంలో ఓ అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించారు. ఐదు సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న దాదాపు 500 మంది చిన్నారుల నుంచి మ‌లం న‌మూనాలు, క్లినిక‌ల్ డేటా సేక‌రించారు. వారిలో ఐదు కేసులు వెలుగు చూసిన‌ట్టు నిపుణులు ప్ర‌క‌టించారు.

ఈ నోరో వైర‌స్ అనేది అన్ని వ‌య‌స్సుల వారిలో డ‌యేరియాకు దారి తీస్తుంది. వాంతులు, నీళ్ల విరేచ‌నాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. డీ హైడ్రేష‌న్‌కు గుర‌వుతారు. అక‌స్మాత్తుగా నీర‌సం అవుతుంది. ఒళ్లు కొంచె వెచ్చ‌గా ఉండ‌డంతో పాటు క‌డుపులో నొప్పి కూడా సంభ‌వించ‌వ‌చ్చు. ప్ర‌ధానంగా వాంతులు, విరేచ‌నాల‌తో వారి శ‌రీరంలోని నీటిశాతం, ల‌వ‌ణాల శాతం త‌గ్గుతుంది. ముఖ్యంగా ఈ వైర‌స్ సోకిన వారికి త‌గినంత విశ్రాంతి ఇవ్వాలి. శిశువులు అయితే పాలివ్వ‌డం మాత్రం ఆప‌కూడ‌దు. ద్ర‌వ పదార్థాలు త‌గినంత‌గా ఇస్తుండాలి. వారి గ‌దిలో వేడి వాతావ‌ర‌ణం లేకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి.

ఇవి కూడా చ‌ద‌వండి :

  1. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు తెలుగు వాడేనా..? వైర‌ల్ అవుతున్న ప్ర‌శాంత్ నీల్ కామెంట్స్‌..!
  2. ముంబై ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం..!
  3. పెళ్లి తర్వాత గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి…?

You may also like