Home » హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ.1 లక్ష జీతం, అర్హతలు ఇవే

హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ.1 లక్ష జీతం, అర్హతలు ఇవే

by Bunty
Ad

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాదులోని ఎన్ఎండిసి లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 42 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి డిపార్ట్మెంటల్/ఎక్స్టర్నల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

Advertisement

ఖాళీలు, అర్హతలు,

# నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Advertisement

# వీటిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఫైనాన్స్&అకౌంట్స్) ట్రైని(11), అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెటీరియల్స్&పర్చేజ్) ట్రైనీ(16), అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (పర్సనల్&అడ్మినిస్ట్రేటివ్) ట్రైనీ (15) ఖాళీలు ఉన్నాయి.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బ్యాచిలర్ డిగ్రీ, సిఏ (ఇంటర్)/ ఐసిడబ్ల్యూఏ-సిఎంఎ (ఇంటర్), బిఈ, బీటెక్, పీజీ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి.

 

# అభ్యర్థుల వయసు 32 ఏళ్ళు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు,

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 17-02-2023 ని చివరి తేదీగా నిర్ణయించారు.

READ ALSO : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-4 లో మరో 141 పోస్టులు

Visitors Are Also Reading