టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నితిన్ కూడా ఉంటాడు. కానీ ప్రస్తుతం నితిన్ కు సరైన హిట్ అనేది లేదు. చివరగా నితిన్ భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నుండి ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు కూడా నితిన్ కు నిరాశే మిగిల్చాయి. దాంతో నితిన్ మళ్ళీ తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ నే నమ్ముకున్నాడు అని తెలుస్తుంది.
Advertisement
నితిన్ చివరగా హిట్ చుసిన సినిమా భీష్మ. అయితే ఈ సినిమాకు దర్శకత్వం అనేది వహించిన వెంకీ కుడుములతోనే నితిన్ తన కొత్త సినిమా అనేది చేయబోతున్నాడు అని తెలుస్తుంది. అయితే వెంకీ కుడుముల భీష్మ సినిమా తర్వాత ఇంకో సినిమా అనేది చేయలేదు. కానీ వెంకీ కుడుముల ఈ హీరోతో సినిమా చేస్తున్నాడు అంటూ చాలా పేర్లు వచ్చాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ఉంది.
Advertisement
కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా అధికారికంగా రాలేదు. అయితే ఇప్పుడు ఈయన మళ్ళీ నితిన్ తో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడట. ఇప్పటికే నితిన్ తో సినిమాకు కథను కూడా సిద్ధం చేసిన వెంకీ కుడుముల.. దానిని నితిన్ కు వినిపించగా.. తనకు బాగా నచ్చింది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు హీరోయిన్ కూడా ఫిక్స్ అయితే త్వరలోనే ఈ కాంబోలో సినిమా షూటింగ్ అనేది త్వరగా ప్రారంభం కానుంది అని సమాచారం.
Advertisement
ఇవి కూడా చదవండి :