Home » బాబర్ రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్..!

బాబర్ రికార్డ్ బద్దలు కొట్టిన రోహిత్..!

by Azhar
Ad

పాకిస్థాన్ జట్టు అనగానే అందరికి బాబర్ ఆజాం మొదట గుర్తుకు వస్తాడు. మొదట తన బ్యాటింగ్ తో పేరు అనేది సంపాదించుకున్న బాబర్ కు కెప్టెన్సీ ఇచ్చింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. అయితే బాబర్ కెప్టెన్ అయిన తర్వాత బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ రికార్డులను బ్రేక్ చేస్తూనే కెప్టెన్సీలో కూడా కొన్ని రికార్డులను క్రియేట్ చేసాడు. అందులో ఒక్కటే.. ఒక్కే ఏడాది ఎక్కువ టీ20 విజయాలు అందుకోవడం.

Advertisement

బాబర్ ఆజాం కెప్టెన్ గా గత ఏడాది 20 టీ20 విజయాలను అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ రికార్డును భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్రేక్ చేసాడు. తాజాగా ప్రపంచ కప్ సూపర్ 12 లో భాగంగా జింబాబ్వేతో భారత్ తలపడిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. అయితే ఇది కెప్టెన్ గా రోహిత్ కు ఈ ఏడాది 21వ విజయం కావడం గమనార్హం.

Advertisement

దీంతో ఒక్కే ఏడాది అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్ గా రోహిత్ క్రికెట్ చేసాడు. అలాగే ఈ మ్యాచ్ విజయంతో రోహిత్ మరో మైలురాయిని కూడా అందుకున్నాడు. ఒక్క ఆటగాడిగా అంతర్జాతీయ మ్యాచ్ లలో రోహిత్ కు ఇది 100వ టీ20 విజయం. ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా 100 విజయాలు అనేవి ఈ టీ20 ఫార్మాట్ లో అందుకోలేదు. ఈ ఫిట్ ను రోహిత్ శర్మ 147 మ్యాచ్ లలో సాధించాడు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ కెప్టెన్ మారనున్నాడా..?

లిటన్ దాస్ కు కోహ్లీ గిఫ్ట్..!

Visitors Are Also Reading