Home » లిటన్ దాస్ కు కోహ్లీ గిఫ్ట్..!

లిటన్ దాస్ కు కోహ్లీ గిఫ్ట్..!

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి అందరికి తెలిసిందే. అయితే కోహ్లీ గ్రౌండ్ లో ఎంతో అగ్రెసివ్ గా ఉంటాడు. కానీ గ్రౌండ్ బయట చూస్తే మాత్రం.. ఆ కోహ్లీకి ఈ కోహ్లీకి అసలు పోలికే ఉండదు. అయితే సొంత జట్టు అయిన.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడంలో కోహ్లీ ఎప్పుడు ముందు ఉంటాడు.

Advertisement

ఇక మన జట్టులో అయితే ఏ ఆటగాడు ఏదైనా సాధిస్తే కోహ్లీ ఆ ఆటగాడి కంటే సంతోషంగా ఉంటాడు. వేరే జట్టు ఆటగాళ్లతో కూడా ఎంతో క్లోజ్ గా ఉండే విరాట్.. గతంలో ప్రాక్టీస్ సెషన్ లో పాకిస్థాన్ బ్యాటర్ కు బ్యాట్ కూడా గిఫ్ట్ అనేది ఇచ్చిన విషయం తెలిసిందే. దానితో ఆ బ్యాటర్ సెంచరీ కూడా చేసాడు. అయితే ఇప్పుడు మళ్ళీ బంగ్లా ఆటగాడికి కోహ్లీ గిఫ్ట్ అనేది ఇచ్చాడు.

Advertisement

ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ లో.. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ బ్యాటింగ్ అనేది క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. అతను ఇండియాను టెన్షన్ పెట్టిన కూడా అతని బ్యాటింగ్ ను అందరూ మెచ్చుకున్నారు. కోహ్లీ కూడా ఆ లిస్ట్ లో ఉన్నాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ స్వయంగా లిటన్ దాస్ వద్దకు వెళ్లి అతడిని ఎంకరేజ్ చేయడానికి బ్యాట్ ను గిఫ్ట్ ఇచ్చాడు. ఈ విషయం స్వయంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ జలాల్ యూనస్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

జింబాబ్వేతో మ్యాచ్ లో వర్షం.. ఇండియా పరిస్థితి ఏంటి..?

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌.. వైరల్ అవుతున్న ధోని..!

Visitors Are Also Reading