Home » రామమందిర ప్రత్యక్షప్రసారం పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం: నిర్మల సీతారామన్

రామమందిర ప్రత్యక్షప్రసారం పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం: నిర్మల సీతారామన్

by Sravya
Ad

రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశమంతా కూడా సిద్ధమవుతోంది. రేపు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా అయోధ్యలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ట వేడుకలు జరగబోతున్నాయి. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తమిళనాడు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. కార్యక్రమాలను తమిళనాడులో బ్యాన్ చేశారని ఆరోపించారు. జనవరి 22న రామ మందిర కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది అని మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు నిర్మల సీతారామన్ ఆరోపణలు తోసి పుచేశారు. తమిళనాడు లోని దేవాలయాల్లో రాముడికి పూజలు, అన్నదానం వంటి కార్యక్రమాల మీద నిషేధం లేదన్నారు.

Advertisement

Advertisement

ట్విట్టర్ లో తమిళనాడు డిఎంకె ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారని నిర్మల సీతారామన్ అన్నారు. తమిళనాడులో 200 శ్రీరాముడి ఆలయాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే దేవాలయాల్లో పూజలు జరగట్లేదు శ్రీరాముడు పేరిట భజన ప్రసాదం అన్నదానానికి అనుమతి లేదు. ప్రైవేట్ గా నిర్వహిస్తున్న ఆలయాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుపడ్డారు హిందూ వ్యతిరేకత ద్వేషాన్ని ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading