Telugu News » Blog » కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !

కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !

by Bunty
Ads

‘అవేరా ఉన్న వారి చమక్కులు’, అంటాడు ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి. నిజమే డబ్బుంటే కొండమీది కోతిని అయినా తెచ్చివచ్చు అంటారు పెద్దలు. మరి పెళ్లి రోజు హెలికాప్టర్ ప్రయాణం కోటీశ్వరుడు అయిన తండ్రికి ఓలెక్క. పెళ్లయ్యాక అత్తారింటికి కారు, బస్సు, రైలులో పంపించడం సర్వసాధారణం. కానీ కుమార్తె ముచ్చట తీర్చడం కోసం ఆ తండ్రి హెలికాప్టర్ బుక్ చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, నెల్లూరు పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ ముక్కాలా ద్వారకానాథ్ కుమార్తె ఉషశ్రీ.

Advertisement

READ ALSO : బాహుబ‌లి సినిమాలో త‌మ‌న్నా రోల్… మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్‌..!

ఆమెను హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ తో వైభవంగా వివాహం జరిపించారు. కనివిని ఎరుగని రీతిలో పెళ్లి చేయించారు. ఇక వివాహ అనంతరం అత్తారింటికి వెళ్లే సమయం వచ్చింది. తన కూతురును ఆషామాషీగా పంపిస్తానా అని భావించి ఆకాశంలో పంపించాడు. కుమార్తెను అత్తారింటికి పంపేందుకు హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నాడు. నెల్లూరు నుంచి విజయవాడకు కూతురు ఉషశ్రీని అల్లుడు ప్రశాంత్ తో హెలికాప్టర్ లో పంపించారు.

Advertisement

READ ALSO : Naveen Case: దొరికే ఛాన్స్ లేదని అనుకున్నాం… నిహారిక సంచలన వ్యాఖ్యలు!

కాగా, హెలికాప్టర్ కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ తయారు చేయించారు. మీరు హెలికాప్టర్ లో వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కాగా, ద్వారకానాథ్ ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్న ద్వారకానాథ్, వైఎస్ జగన్ అంటే అభిమానం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఏకంగా 418 కిలోల వెండి ఆభరణాలతో జగన్ చిత్రపటం రూపొందించి ప్రత్యేకత చాటుకున్నాడు.

Advertisement

READ ALSO :  ఈ 3 లక్షణాలు మీలో ఉన్నాయా… అయితే గుండెపోటు వచ్చే ప్రమాదం పక్కా!

You may also like