Home » Naveen Case: దొరికే ఛాన్స్ లేదని అనుకున్నాం… నిహారిక సంచలన వ్యాఖ్యలు!

Naveen Case: దొరికే ఛాన్స్ లేదని అనుకున్నాం… నిహారిక సంచలన వ్యాఖ్యలు!

by Bunty
Ad

నవీన్ కేసులో రోజుకో షాకింగ్ నిజం బయటపడుతుంది. నవీన్ కేసులో ఇప్పటికే హరిహరకృష్ణ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా హరిహర కృష్ణ, ప్రియురాలు నిహారికను మరియు అతని స్నేహితుడు హసన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో హరిహర కృష్ణ ఏ1గా, హసన్ ను ఏ2గా, అలాగే నిహారికను ఏ3గా పోలీసులు గుర్తించారు. అయితే నవీన్ హ* కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న హరిహరకృష్ణ ప్రియురాలు నిహారిక పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించింది. నవీన్ కేసులో దొరికే ఛాన్స్ లేదని హరి చెప్పాడు.

READ ALSO : NOKIA : లోగో మార్చిన నోకియా… ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం

Advertisement

దీంతో హరిని నమ్మాను అని పోలీసులతో నిహారిక వివరించింది. తాను, నవీన్ ఇంటర్ నుంచి ప్రేమించుకున్నామని, తమ ఇంట్లోనే ఇద్దరం కలుసుకునే వాళ్ళమని చెప్పింది. నవీన్, తాను గొడవ పడితే హరిహర కృష్ణ సర్ది చెప్పేవాడని, ఇద్దరి మధ్య తనే మధ్యవర్తిగా ఉండేవాడని వెల్లడించింది. తాను, నవీన్ విడిపోయాక హరి, తనను ప్రేమిస్తున్నానని చెప్పానని వెల్లడించింది. అంతేకాక హరిహర కృష్ణ తరచుగా నవీన్ ని చంపేసి, తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్తానని అనేవాడని, తాను మందలిస్తే ఊరికే సరదాగా అన్నానని చెప్పేవాడని యువతి పోలీసులకు తెలిపింది.

Advertisement

READ ALSO : Rishab Shetty: రాజకీయాల్లోకి “కాంతార” హీరో రిషబ్ శెట్టి…!

అంతేకాక హరి, నవీన్ ను హ* చేయడానికి వాడిన కత్తులు, రెండు గ్లౌజులు తనకు చూపించాలని యువత వెల్లడించింది. నవీన్ హ* తర్వాత తను నాలుగు సార్లు హరిని కలిశానని తెలిపింది. హా* విషయం గురించి తనకు తెలిసినా కావాలని పోలీసులకు, ఫ్రెండ్స్ కు చెప్పలేదని వెల్లడించింది. ఈ కేసులో తాము దొరికే అవకాశం లేదని హరి తనతో చెప్పాడని, అతని మాటలు నమ్మానని యువతి వెల్లడించింది. నవీన్ హ* తర్వాత తాము వనస్థలిపురం ప్రాంతంలో మూడుసార్లు కలిసాం అని ఒప్పుకుంది. హా* తర్వాత హరికి 1500 రూపాయలు ఇచ్చి పారిపోయేందుకు సహకరించానని యువతి అంగీకరించింది.

READ ALSO : “బలగం” వివాదంపై జబర్దస్త్ వేణు క్లారిటీ.. అసలు కథ ఎవరిదంటే ?

Visitors Are Also Reading