Home » బాహుబ‌లి సినిమాలో త‌మ‌న్నా రోల్… మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్‌..!

బాహుబ‌లి సినిమాలో త‌మ‌న్నా రోల్… మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్‌..!

by Bunty
Ad

 

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం బాహుబలి ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా సౌత్ సినిమాలు నార్త్ సినిమాల కంటే ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించిన సినిమా బాహుబలి. ఇక ఈ సినిమాతోనే సౌత్ నుంచి ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు రావడం మొదలయ్యాయి. బాహుబలి చిత్రం రెండు పార్ట్ లుగా వచ్చింది.

READ ALSO :  ఈ 3 లక్షణాలు మీలో ఉన్నాయా… అయితే గుండెపోటు వచ్చే ప్రమాదం పక్కా!

Advertisement

బాహుబలి చిత్రంలో బాహుబలి, బళ్లాలదేవుడు తరువాత ముఖ్యమైన పాత్ర కట్టప్ప పాత్ర ఒకటి. ఇది ఇలా ఉండగా, రాశి ఖన్నా గురించి తెలియని వారుండరు. మొదటి సినిమాతో మంచి పేరు రావడంతో వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. నిజానికి మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. అయితే తాజాగా బాహుబలి సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రాశి ఖన్నా.’

Advertisement

READ ALSO : NOKIA : లోగో మార్చిన నోకియా… ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం

“నేను నటించిన మద్రాస్ కేఫ్ సినిమా అయిపోయాక రాజమౌళి సార్ బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. తమన్నా నటించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్ జరిగింది. నాకు పిలుపు వచ్చింది, వెళ్లాను. కానీ రాజమౌళి సార్ నన్ను చూసి చాలా క్యూట్ గా ఉంది అమ్మాయి, ఏదైనా లవ్ స్టోరీకి బాగా సెట్ అవుతుంది అన్నాడు. నా స్నేహితుడు ఒకరు మంచి ప్రేమ కథ పై వర్క్ చేస్తున్నాడు. ఓసారి ఆ కథ విను నీకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. అలా ఊహలు గుసగుసలాడే తో నేను తెలుగులో లాంచ్ అయ్యాను. కానీ రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా చేయాలనుంది” అని చెప్పు కొచ్చింది రాశిఖన్నా.

READ ALSO : Naveen Case: దొరికే ఛాన్స్ లేదని అనుకున్నాం… నిహారిక సంచలన వ్యాఖ్యలు!

Visitors Are Also Reading