2023 జనవరి 01తో ఎంట్రీ ఇచ్చాం. మరో రెండు రోజుల్లో కొత్త నెలలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. కొత్త నెల వస్తూనే కొత్త రూల్స్ కూడా తీసుకొస్తుంది. ఫిబ్రవరి 01 నుంచి కొత్త రూల్ ఒకటి అమలులోకి రాబోతుంది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది. మ్యూచ్ వల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టే వారికి పెట్టాలని భావించే వారికి కొత్త రూల్ వల్ల ప్రయోజనం కలుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వారు ఇకపై త్వరితగతిన డబ్బులను మీ బ్యాంకు అకౌంట్ లోకి చేరుతాయి.
Advertisement
అసెస్ మేనేజ్మెంట్ కంపెనీలు ఫిబ్రవరి నెల నుంచి మ్యూచ్ వల్ ఫండ్స్ యూనిట్ల విక్రయం తరువాత టీ ప్లస్ 2 విధానంలో సెటిల్ మెంట్ చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ని అమ్మేసిన రోజు కాకుండా.. తరువాత రెండు రోజుల్లో డబ్బులు ఇన్వెస్టర్ల అకౌంట్ లోకి వస్తున్నాయి. స్టాక్ మార్కెట్ లో జనవరి 27న యాంఫీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈక్విటి స్కీమ్ కి ఈటీ ఫ్లస్ 2 రూల్ వర్తిస్తుందని పేర్కొంది. ట్రేడ్ చేసిన డేట్ ప్లస్ 2 రోజులు. మొత్తానికి ఇవాళ ట్రేడ్ చేస్తే.. వచ్చే రెండు రోజుల్లో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఫిబ్రవరి 01 నుంచి కటాఫ్ టైమింగ్ కన్నా ముందు జరిగే ట్రాన్సాక్షన్ అన్నింటికీ టీ ప్లస్ 2 సెటిల్ మెంట్ వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. దీంతో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
Advertisement
గతంలో టీ ప్లస్ 3 సెటిల్ మెంట్ విధానం అమలులో ఉండేది. ఇప్పుడు ఒక రోజు తగ్గింది. ఇండియన్ ఈక్విటి మార్కెట్లు ప్లస్ 1 సెటిల్ మెంట్ సైకిల్ ని ఎంచుకున్నాయి. అన్ని స్టాక్స్ కి వర్తిస్తుంది. ఇవాళ ట్రేడ్ చేస్తే.. రేపటి వరకు డబ్బులు ఇన్వెస్టర్ల బ్యాంకు అకౌంట్లలోకి వచ్చి చేరుతాయి. అదేవిధంగా ఈరోజు షేర్లు కొంటే తరువాత రోజు వరకు షేర్లు మీ డీ మ్యాట్ ఖాతాలోకి వచ్చేస్తాయి. జనవరి 27 నుంచి ఈ టీ ప్లస్ 1 సెటిల్ మెంట్ విధానం అమలులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ లో టీ ప్లస్ 1 సెటిల్ మెంట్ పేమెంట్ విధానం ప్రపంచంలో తొలిసారిగా మన దేశంలోనే అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో కూడా మార్పులు తెచ్చారు. ట్రేడ్ సెటిల్ మెంట్ ప్రక్రియని టీ ప్లస్ 3 నుంచి టీ ప్లస్ 2 కి తగ్గించారు. అందుకే త్వరితగతిన సెటిల్ మెంట్ పూర్తవుతుంది. డబ్బుల అందుబాటులోకి వస్తాయి.