Telugu News » Blog » విజయసాయి రెడ్డికి తారకరత్న అంత దగ్గరి బంధువా…ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే..!

విజయసాయి రెడ్డికి తారకరత్న అంత దగ్గరి బంధువా…ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే..!

by AJAY
Ads

టాలీవుడ్ హీరో.. నందమూరి కుటుంబ సభ్యుడు తారకరత్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తారకరత్న ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హీరోగా, విలన్ గా మరియు అనేక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇదిలా ఉంటే తారకరత్న తన తాత ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి మద్దతు గా నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

గతంలో తారకరత్న టిడిపికి సపోర్ట్ చేశారు. అంతేకాకుండా తాజాగా నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రకు మద్దతుగా నిలుస్తూ ఆ యాత్రలో కూడా పాల్గొన్నారు. అయితే కొంత దూరం నడిచిన తర్వాత తారకరత్న సడెన్ గా స్పృహ తప్పి పడిపోయారు. దాంతో వెంటనే కార్యకర్తలు, సిబ్బంది ఆసుపత్రికి తరలించగా తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వైద్యం నిర్ధారించారు.

taraka ratna wife

Advertisement

95 శాతం వాల్స్ బ్లాక్ అయ్యాయని తెలిపారు. ఇక ప్రస్తుతం తారకరత్న ఆస్పత్రిలో ఉండటంతో ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తారకరత్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బంధువు అవుతారు అన్న విషయం కూడా వైరల్ అవుతోంది. విజయసాయి రెడ్డి వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. టిడిపిని విమర్శిస్తూ వైసిపి తరఫున విజయసాయిరెడ్డి పోరాడుతూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా మరియు మీడియా సమావేశాల ద్వారా విజయసాయిరెడ్డి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ ఎంతో గుర్తింపు సాధించారు.

Advertisement

అయితే విజయసాయి రెడ్డి తారకరత్నకు స్వయానా మామయ్య వరుస అవుతారు. విజయసాయిరెడ్డి భార్య కూతురు అయిన అలేఖ్య రెడ్డిని తారకరత్న వివాహం చేసుకున్నారు. తారకరత్న అలేఖ్య పెళ్లికి మొదట్లో కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు వారి వివాహానికి ఒప్పుకున్నారు. తారకరత్న నటించిన ఓ సినిమాకు అలేఖ్య రెడ్డి డిజైనర్ గా పనిచేయగా ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా గా మారింది. ఆ తరవాత పెద్దలను ఎదిరించి ప్రేమను గెలిపించుకున్నారు. కానీ ఇపుడు తారకరత్న కు గుండెపోటు ఆయన కుటుంబం లో విషాదం నిండుకుంది.