Home » ఆస్కార్ సభ్యత్వ నమోదుకు వెళ్లాలంటే కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఈ రూల్స్ గురించి తెలుసా? కొత్తగా వచ్చిన ఇంకో రూల్ ఏంటంటే?

ఆస్కార్ సభ్యత్వ నమోదుకు వెళ్లాలంటే కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఈ రూల్స్ గురించి తెలుసా? కొత్తగా వచ్చిన ఇంకో రూల్ ఏంటంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

96వ ఆస్కార్ వేడుక‌ల్లో తెలుగు సినిమాకు ఎన‌లేని గౌర‌వం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ లు హీరోలుగా న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అవ్వ‌డ‌మే కాకుండా ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరిలో నాటు నాటు పాట‌ అవార్డును సైతం ద‌క్కించుకుంది.

Advertisement

ఈ సందర్భంగా “నాటు నాటు పాటకి గాను మ్యూజిక్‌ డైరెక్టర్‌ యంయం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌లకు, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు, సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్ లు కూడా ఆస్కార్ అకాడమీ సభ్యులు అయ్యారు. ‘ఆస్కార్‌ అకాడమీ సభ్యత్వ నమోదు కోసం ఇప్పటికే ఈ ఆరుగురికి ఇన్విటేషన్లు వచ్చాయి. ఈ విషయమై గర్వంగా ఉందని రాజమౌళి పేర్కొన్నారు. అయితే.. ఇలా సభ్యత్వ నమోదు చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయట.

Advertisement

మనం ఏదైనా సినిమాను ఆస్కార్ ఎంట్రీ కి పంపించాలంటే యూఎస్‌లోని ఆరు ప్రధాన నగరాల్లో (న్యూయార్క్, లాస్‌ ఏంజెల్స్, చికాగో, మియామి, అట్లాంటా, శాన్‌ ఫ్రాన్సిస్‌కో) లలో కనీసం వారం పాటు ప్రదర్శితం అయ్యి ఉండాలట. ఈ ఏడు రోజుల్లో ఒక షో అయినా ప్రైమ్‌ టైమ్‌లో ప్రదర్శితం అయ్యి ఉండాలట. బెస్ట్‌ పిక్చర్, ఫారిన్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ విభాగాల విషయంలో మరో కొత్త రూల్ తీసుకొచ్చారట. ఇక నుంచి ఏ సినిమాని అయినా ఆస్కార్ కు పంపాలంటే కనీసం పాతికకి పైగా మూవీ మార్కెట్స్‌ ఉన్నచోట రెండు వారాలకు పైగా ఆ సినిమాని ప్రదర్శించాలట. ఈ రూల్ 97వ ఆస్కార్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవం (2025) నుంచి అమలులోకి వస్తుందట. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చాలా మంది పెదవి విరుస్తున్నారట.

మరిన్ని ముఖ్య వార్తలు:

BRO: బ్రో టీజర్ లో ఇంత మాటర్ ఉందా? ఈ విషయాలను నోటిస్ చేశారా?

సోంపు గింజలు తీసుకోవడం వలన ఎన్ని లాభాలో తెలిస్తే.. రోజూ తింటారు..!

ఇక కృష్ణ పని అయిపోయిందన్న టైంలో.. చిరు, నాగ్ లకి పెద్ద షాక్..!

Visitors Are Also Reading