తెలంగాణలోని కెసిఆర్ ప్రభుత్వం… అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రైతులు, మహిళలు అలాగే పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది కేసీఆర్ సర్కారు. అయితే తాజాగా మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.
Advertisement
ఎన్నికలకు మరో ఐదు నెలలు సమయం ఉన్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల పై కీలక ప్రకటన చేసింది కేసీఆర్ సర్కార్. జూన్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియను పౌరసరాఫరాల శాఖ వేగవంతం చేసింది. రేషన్ కార్డులు ఇచ్చేందుకు రెండు కమిటీలను కూడా నియమించింది.
Advertisement
ఇక కొత్తగా పెళ్లి చేసుకున్న వారు, అదే విధంగా కుటుంబం పెరిగిన వాళ్లకు ఇది మంచి అవకాశం. కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు, కొత్త పేర్లను చేర్చుకునేవారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు సైతం లింక్ అయ్యి ఉంటాయన్న సంగతి తెలిసిందే. కాబట్టి కచ్చితంగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
‘కస్టడీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్… స్ట్రీమింగ్ అప్పటి నుంచే!
ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు… లక్ష జీతం
Suryakumar Yadav : సూర్య బ్యాటింగ్ చూసి సచిన్ షాక్… వీడియో వైరల్