Home » కోహ్లీ ఇన్నింగ్స్ క్రికెట్ భగవద్గీత..!

కోహ్లీ ఇన్నింగ్స్ క్రికెట్ భగవద్గీత..!

by Azhar
Ad
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా గత ఆదివారం ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఫ్యాన్స్ ఇంకా మరిచిపోవడం లేదు. ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ ను అద్భుతమైన ఇన్నింగ్స్ తో గెలిపించాడు విరాట్ కోహ్లీ. తాను క్రికెట్ ప్రపంచానికి ఎందుకు కింగ్ అనే విషయాని ఈ ఇన్నింగ్స్ తో అందరికి నిరూపించాడు విరాట్ కోహ్లీ.
అయితే ఈ వారం నుండి విరాట్ పై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ను భగవద్గీతతో పోల్చాడు ఆస్ట్రేలియా మాజీ లెజెండ్, టీమిండియా మాజీ హెడ్ కోచ్ గ్రెగ్ ఛాపెల్. హిందువులకు భగవద్గీత అనేది ఎంతో పవిత్రం. భగవద్గీత నాటే స్వయంగా దేవుడి నోటి నుండి వచ్చిన మాటలు. అయితే పాకిస్థాన్ పై విరాట్ ఆడిన ఇన్నింగ్స్ కూడా క్రికెట్ ప్రపంచంలోకి వచ్చే యువకులకు భగవద్గీత వంటిదే అని గ్రెగ్ ఛాపెల్ పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో ఆడిన ఇన్నింగ్స్ ఇంకా కాళ్ళ ముందే తిరుగుతుంది. అయితే క్రికెట్ లో ఎంతో మంది లెజెండ్ ఆటగాళ్లు ఉన్నారు. కై అందులో ఎవరు కూడా ఈ రకమైన ఇన్నింగ్స్ అనేది ఆడలేదు. ఇది నా కెరియర్ లో చుసిన బెస్ట్ ఇన్నింగ్స్. హొప్ప ఆటగాళ్లు కేవలం పరుగులు చేయడం వల్ల కారు. వారు ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో పరుగులు చేసారు అనే దానిని బట్టే గొప్ప ఆటగాళ్లు అవుతారు అని గ్రెగ్ ఛాపెల్ అన్నాడు.

Advertisement

Visitors Are Also Reading