Home » రాహుల్ పై మళ్లీ సెటైర్లు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

రాహుల్ పై మళ్లీ సెటైర్లు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

by Anji
Ad

సాధారణంగా క్రికెట్ లో ఫామ్ లో లేని ఆటగాడిని విమర్శించే విషయం అందరికీ తెలిసిందే. అలా క్రికెట్ అభిమానులు, మాజీలు అనుకున్నట్టుగానే ఎట్టకేలకు జరిగిందనే చెప్పవచ్చు. చాలా కాలంగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న కే.ఎల్.రాహుల్ ను ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ కి తప్పించారు. అతని స్థానంలో ఓపెనర్ గా శుభ్ మన్ గిల్ ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటిరెండు టెస్టుల్లో అతని మూడు ఇన్నింగ్స్ లు కలిపి కేవలం 20, 17, 1 పరుగులు చేశాడు. దీంతో తుది జట్టు  నుంచి అతన్ని తప్పించాలని వాదనలు ఎక్కువగా వినిపించాయి. 

Also Read :  బెంగళూరులో దారుణం.. తెలుగు యువతిని ఏం చేశారంటే..? 

Advertisement

ముఖ్యంగా మాజీ పేసర్ వెంకటేష్ టీమ్ మేనేజ్ మెంట్ పై కాస్త గట్టిగానే విమర్శలు చేసాడు. చాలా మంది ప్లేయర్లు టీమ్ లో స్థానంలో ఎదురుచూస్తుంటే.. రాహుల్ కి పదే పదే అవకాశాలు ఎందుకు ఇస్తున్నారంటూ ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలోనే మూడో టెస్ట్ కి రాహుల్ ని తప్పిస్తూ.. బోర్డు నిర్ణయం తీసుకుంది. గిల్ ను ఆడించింది. దీంతో నెట్టింట మీమ్స్ సందడి ఎక్కువ అయిపోయింది. కే.ఎల్. రాహుల్ ను తప్పించారని తెలియగానే సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ విషయంపై మీమ్స్ కనిపించాయి. 

Advertisement

Also Read :  మీ కలలో నీళ్లు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?

Manam News

కే.ఎల్. రాహుల్ ని టీమ్ నుంచి తప్పించారని తెలియగానే తెలుత ఎక్కువగా సంతోషపడే వ్యక్తి వెంకటేష్ ప్రసాద్ అయి ఉంటాడని మీమర్స్ రచ్చ చేసారు. హమ్మయ్య వెంకటేష్ ప్రసాద్ ఇక హ్యాపీ అంటూ కొంత మంది నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు. ఈ విషయం తెలియగానే వెంకటేష్ ప్రసాద్ ఇలా డ్యాన్స్ చేసి ఉంటాడేమో అంటూ.. సరదా వీడియోలను కూడా పోస్ట్ చేశారు. మరికొందరూ కే.ఎల్. రాహుల్ గత ఆటతీరును ఉద్దేశిస్తూ ట్వీట్లు పోస్ట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాటిని చూసి ఎంజాయ్ చేయండి.  

Also Read :   ఏసీసీ మెన్స్ ఛాలెంజర్ కప్-2023లో రికార్డు స్కోరు.. భారీ విజయం..!

Visitors Are Also Reading