Home » క్రిటిక్స్ ను మెప్పించలేకపోయిన రాజమౌళి సినిమాలు ఏవేవో మీకు తెలుసా…?

క్రిటిక్స్ ను మెప్పించలేకపోయిన రాజమౌళి సినిమాలు ఏవేవో మీకు తెలుసా…?

by Azhar
Ad
ప్రస్తుతం కేవలం మన టాలీవుడ్ లోనే కాదు.. మొత్తం ఇండియాలోన్నే నెంబర్ డైరెక్టర్ మన రాజమౌళి. అయితే ఇప్పుడు రాజమౌళి అనేది కేవలం పేరుగా కాకుండా బ్రాండ్ గా మారిపోయింది. ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా రాణి దర్శకుడు మన జక్కననే. ఎందుకంటే రాజమౌళి నుండి వచ్చే ప్రతి సినిమా హిట్ కాదు.. సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు జనాలు. కానీ రాజమౌళి కొన్ని సినిమాలు అభిమానులు ఎంత మెప్పించిన క్రిటిక్స్ ను మాత్రం మెప్పించలేదు. అయితే ఇప్పుడు ఆ సినిమాలు ఏవో చూద్దాం.
రాజమౌళి దర్శకత్వంలో  2004లో వచ్చిన మూడో సినిమా సై. నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు క్రిటిక్స్ మార్కులు వెయ్యలేదు. ఈ సినిమా అందరికి రీచ్ కాదు అని చెప్పారు. అదే విధంగా మాస్ మహారాజ రవితేజ రాజమౌళి కాంబినేషన్ లో 2006 లో వచ్చిన సినిమా విక్రమార్కుడు. రవితేజ దౌన్ల్ యక్షలో కనిపించిన ఈ సినిమాలో లాజిక్ లేని సీన్స్ తో పాటుగా గౌల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయని క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. కానీ ఫ్యాన్స్ మాత్రం అలా అనుకోలేదు. అంచనాలకుమించిన హిట్ కొట్టింది ఈ సినిమా.
ఇక 2010 లో మగధీర వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కమెడియన్ గా గుర్తింపు తెచుకున్న సునీల్ తో తీసిన సినిమా మర్యాద రామన్న. ఈ సినిమా హిట్ అయిన ఇందులో చాలా సీన్లు వేరే సినిమా నుండి కాపీ కొట్టాను అనే వాదనలు క్రిటిక్స్ నుండి వచ్చాయి. ఇక తాజాగా బాహుబలి వంటి భారీ విజయం తర్వాత జక్కన్న అభిమానుల ముందుకు తెచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. అయితే ఈ సినిమాలో ఉన్న రెండు పాత్రలను ఇద్దరు హీరోలను రాజమౌళి బ్యాలెన్స్ చేయలేకపోయాడు అనే కామెంట్స్ క్రిటిక్స్ నుండి వచ్చాయి. అయిన కూడా ఈ సినిమా 1100 కోట్లు కలెక్ట్ చేసింది.

Advertisement

Visitors Are Also Reading