Home » స్టేజీపైనే ముద్దులతో రచ్చ చేసిన నరేష్ – పవిత్ర…!

స్టేజీపైనే ముద్దులతో రచ్చ చేసిన నరేష్ – పవిత్ర…!

by Bunty
Ad

నరేష్ గురించి తెలియని వారు ఉండరు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న నరేష్ ప్రస్తుతం సహనటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. వీరిద్దరి రిలేషన్ పై మీడియాలో ఏ రేంజ్ లో రచ్చ జరిగిందో తెలిసిందే. ఈ కాంట్రవర్సీ కపుల్ లీడ్ రోల్స్ లో నటించిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లి. నటుడు నరేష్ లీడ్ రోల్ లో యూనిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘మళ్ళీ పెళ్లి’ చిత్రానికి ప్రముఖ ఫిలిం మేకర్ ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు.

Advertisement

ఈ మూవీలో నరేంద్రగా నరేష్, పార్వతిగా పవిత్ర లోకేష్ కనిపించారు. మూడో భార్య రమ్య రఘుపతి పాత్రలో వనిత విజయ్ కుమార్ నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓంకార్ నిర్వహిస్తున్న సిక్స్త్ సెన్స్ షోలోకి గెస్ట్ గా వీరిద్దరు వచ్చారు. ఇక వీరిద్దరూ ఇందులో రెచ్చిపోయి కనిపించడం మరోసారి చర్చకు దారి తీసింది. ఈ షోలో పవిత్రని మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు అని నరేష్ ని ఓంకార్ అడగగా… ముద్దుగా పవిత్రని అమ్ములు అని పిలుస్తానని… ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము అని, మరీ ఇంకా ప్రేమ ఎక్కువైతే ఏమని పిలుస్తానో…? అన్నారు.

Advertisement

ఇక రిలేషన్షిప్ గురించి ప్రశ్నిస్తే ఆకాశం మీద పడినా, భూమి బద్దలైన మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ నరేష్-పవిత్ర ఇద్దరూ చేయి చేయి పట్టుకొని చూపించారు. అంతేకాదు ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

IPL 2023 : ధోని ఆటోగ్రాఫ్‌ తీసుకున్న గవాస్కర్..ఫోటో వైరల్

భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

Visitors Are Also Reading