Home » అమిత్ షాతో నారా లోకేష్ రహస్య మంతనాలు…బీజేపీలో టీడీపీ విలీనం కానుందా !?

అమిత్ షాతో నారా లోకేష్ రహస్య మంతనాలు…బీజేపీలో టీడీపీ విలీనం కానుందా !?

by Bunty

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా నడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. అసలు నాయకుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటం… అటు నారా లోకేష్ ఢిల్లీలోనే పాగా వేయడం తో… తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో తీవ్ర ఆందోళన నెలకొంది.

Nara Lokesh Met Amith Shah

Nara Lokesh Met Amith Shah

అసలు చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి వస్తాడా ? వస్తే ఎప్పుడు వస్తాడు ? ఎన్నికలు అయ్యాక వస్తాడా లేక ? పర్మినెంట్గా జైల్లోనే ఉంటాడా అని ప్రశ్నలు సాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 33 రోజులుగా చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసిన కోర్టు తిరస్కరిస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో.. తెలుగుదేశం పార్టీ అగ్ర నేత నారా లోకేష్.. అమిత్ షా ఇంట్లో కనిపించారు.

పురందరేశ్వరి మరియు కిషన్ రెడ్డి సమక్షంలో కేంద్ర హోం శాఖ మంత్రి, బిజెపి అగ్ర నేత అమిత్ షా ఇంటికి వెళ్లారు నారా లోకేష్. ఈ సమావేశంలో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు వివరించారు నారా లోకేష్. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్, సీఎం జగన్ పనితీరును నారా లోకేష్ వివరించినట్లు సమాచారం. అయితే అమిత్ షా ను నారా లోకేష్ కలవడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద పోస్ట్ పెట్టారు. తెలుగుదేశం పార్టీని బిజెపిలో విలీనం చేసేందుకు నారా లోకేష్…. అమిత్ షాను సెటైర్లు పేల్చుతూ పోస్ట్ పెట్టాడు అంబటి రాంబాబు. ఇప్పుడు ఈ ట్వీట్ ఏపీ రాజకీయాలలో కొత్త చర్చకు దారితీస్తోంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading