Home » మరో కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్న నాని..!

మరో కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్న నాని..!

by Anji

నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను ఎలాంటి పాత్రలోనైనా ఇలా ఒదిగిపోతాడు. అతని నటనను అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇటీవల శ్యామ్ సింగారాయ్ సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ అంటే సుందరానికి సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ న్యాచురల్ స్టార్ దసరా సినిమాలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదల అవ్వక ముందే మరో చిత్రాన్ని లైన్ లో పెట్టే పనిలో పడినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నాని ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడుని పరిచయం చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో టాప్ నడుస్తోంది.

Also Read : చిరంజీవిని కేక్ లో విషం పెట్టి చంపాలని ప్లాన్ వేసింది ఎవరంటే..?

దసర చిత్రంలో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని, ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని లాంచ్ చేయనున్నాడని సమాచారం. మోహన్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నాని వెంటనే సినిమాకు ఓకే చెప్పాడని నాని కెరీర్ లో మునుపెన్నడూ రాని డిఫరెంట్ స్టోరీ లైనప్ తో ఈ సినిమా ఉండనుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Also Read : సమంత డైవర్స్ తీసుకున్నాక తాళిని ఏం చేసిందో తెలుసా..?


ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం దసరా మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా తదనంతర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Also Read : కృష్ణంరాజుకు ఆ ఒక్క సినిమా అంటే చాలా ఇష్టమట.. నాన్నను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన ప్రసీద..!!

 

Visitors Are Also Reading