Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » కృష్ణంరాజుకు ఆ ఒక్క సినిమా అంటే చాలా ఇష్టమట.. నాన్నను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన ప్రసీద..!!

కృష్ణంరాజుకు ఆ ఒక్క సినిమా అంటే చాలా ఇష్టమట.. నాన్నను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన ప్రసీద..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

అలనాటి స్టార్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోవడం ఫ్యాన్స్ ని ఎంతో కలచివేసింది. ఇప్పటికీ ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ప్రభాస్ అయితే ఇంకా బాధ నుంచి బయట పడినట్లు కనబడటం లేదు. ఒకవైపు సినీ నటులు మరోవైపు వారి ఫ్యామిలీ,అభిమానులు ఇంకా కృష్ణంరాజు తో ఉన్నటువంటి అనుబంధాలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఈ తరుణంలోనే ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రభాస్ మరియు కృష్ణంరాజు కలయికలో వచ్చిన బిల్లా మూవీ మరోసారి థియేటర్లలోకి రానుంది..

Advertisement

Ad

also read:చిరంజీవిని కేక్ లో విషం పెట్టి చంపాలని ప్లాన్ వేసింది ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో హీరోల బర్త్ డే కు వారి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను రిలీజ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే..అయితే అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ బర్త్ డే సందర్భంగా బిల్లా మూవీని మళ్లీ థియేటర్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కృష్ణంరాజు కుమార్తె సాయి ప్రసీద ఈ విషయాలను బయటపెట్టింది.. ఆమె ఏమన్నది అంటే.. తండ్రి మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ప్రసీద మాట్లాడుతూ.. బిల్లా సినిమా తో మాకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయ్ అని, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై నాన్న మరియు అన్నయ్య కలిసి నటించిన తొలి చిత్రం బిల్లా అని తెలియజేసింది.

అలాగే నాన్నకు ఈ చిత్రం అంటే చాలా ఇష్టమని. మళ్లీ ఈ సినిమాను ఫోర్ కె లో రిలీజ్ చేస్తున్నందుకు మెహర్ రమేష్ అంకుల్ కు ధన్యవాదాలు అని తెలిపింది. స్పెషల్ షో ద్వారా వచ్చే అమౌంట్ ను ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ కు అందిస్తామని తెలిపింది. ఇందులో నాన్న భాగస్వామిగా ఉన్నారని తెలియజేసింది. అభిమానులు మళ్లీ ఈ సినిమాను ఆదరించి చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చింది ప్రసీద..

Advertisement

also read:

Visitors Are Also Reading