Home » చిరంజీవిని కేక్ లో విషం పెట్టి చంపాలని ప్లాన్ వేసింది ఎవరంటే..?

చిరంజీవిని కేక్ లో విషం పెట్టి చంపాలని ప్లాన్ వేసింది ఎవరంటే..?

by Sravanthi
Ad

చిరంజీవి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అనేక కష్టాలు పడ్డాడు. అవమానాలు భరించాడు. చివరికి ఇండస్ట్రీలోనే మెగాస్టార్ గా మారాడు.. అలాంటి చిరంజీవి దశ మార్చిన సినిమా ఏంటి.. ఆయనను కేక్ లో విషం పెట్టి చంపాలని చూసింది ఎవరు అనే విషయాలు తెలుసుకుందాం.. చిరంజీవి ఖైదీ సినిమాకి ముందు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఖైదీ సినిమా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి తనలోని నట విశ్వరూపం చూపించాడు. ఈ మూవీ తర్వాత ఆయన దశ మారింది. డ్యాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ ఎన్టీఆర్ తర్వాత ఆ లెవల్ లో వచ్చిన హీరో చిరంజీవి అని భావించారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో చిరంజీవిని ఎలాగైనా తొక్కేయాలని ప్లాన్ చేస్తున్నారు. అడవి దొంగ, విజేత, కిరాతకుడు, కొండవీటి రాజా, దొంగ మొగుడు ఇలా ఎన్నో సినిమాలు చేసి హిట్ల మీద హిట్లు కొట్టారు.

Advertisement

also read:Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి

ఈ క్రమంలోనే చిరంజీవి అంటే గిట్టని కొంతమంది ఆయనను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేశారు. అప్పటికే స్టార్ హీరో అయినా చిరంజీవి బయట ఎక్కడ కూడా ఓపెన్ గా తినేవారు కాదు. చాలా జాగ్రత్తగా ఉండేవారు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకునేవారు. ఏ కొత్త పదార్థం తినాలన్నా భయపడేవారు. ఏదైనా సమస్య వస్తే సినిమా షూటింగ్స్ ఆగిపోతాయని భావించేవారు. ఈ విధంగా చుట్టూ శత్రువులు ఉండడం వల్లచిరంజీవికి తన సినీ కెరీర్ అంటే భయం పట్టుకుంది. అందుకే చాలా కేర్ఫుల్ గా ఉండేవారు.

Advertisement

ఇక ఆయన షూటింగ్ ఎక్కడ జరిగినా విపరీతమైన అభిమానులు అక్కడికి చేరుకునే వారు. చిరంజీవి కూడా అభిమానులను చాలా ప్రాణంగా చూసుకునే వారు. మద్రాసులో “మరణమృదంగం” సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ సమయంలో బయట చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారని అసిస్టెంట్ చెప్పగానే వెళ్లి తొందరగా వచ్చేయాలి అనుకున్నారు చిరంజీవి. గేటు వద్దకు వెళ్లగానే ఒక ఫ్యాన్ వచ్చి చిరంజీవి కాళ్ళ మీద పడ్డాడు. సార్ ఈరోజు నా బర్త్ డే, నేను కేక్ కట్ చేస్తాను. మీరు నా పక్కన ఉండండి సార్ అంటూ వేడుకున్నాడు. దీంతో కాదనలేక చిరంజీవి ఓకే అన్నాడు. ఆ కుర్రాడు కేక్ కట్ చేయగానే, చిరంజీవి చప్పట్లు కొట్టి విషెస్ చెప్పారు. ఆ కేక్ పీస్ తినాలని ఫ్యాన్ బలవంతం చేశాడు.

కానీ చిరు నేను షూటింగ్లో ఉన్నాను వద్దు అని చెప్పినా వినకుండా ఆ కేకు నోట్లో కుక్కాడు. చిరంజీవి భయంతో కిందకు ఉమ్మేసాడు. ఈ తోపులాటలో కేక్ అంతా కింద పడింది. ఆ కేకు మధ్యలో రంగురంగుల పదార్ధాలు ఉన్నాయి. దీంతో చిరు వేగంగా వెనక్కి కడిగేసుకున్నాడు. షాట్ కు రెడీ అయ్యేందుకు మిర్రర్ లో చూసుకోగా, చిరంజీవి పెదాలు చాలా ఎర్రగా అయ్యాయి. వెంటనే చిత్రయూనిట్ ఆస్పత్రికి తరలించారు. ఏదైనా విషం కడుపులోకి వెళ్లిందా అని అనుమానం తో అంతా కక్కించారు. తర్వాత ట్రీట్మెంట్ చేసి, ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తారు. ఈ వార్త అప్పటికే బయటకు వెళ్లడంతో మీడియాలో టామ్ టామ్ ఐపోయింది. ఈ విధంగా చిరంజీవి ఎన్నో కష్టాలు పడుతూ చాలా జాగ్రత్తగా మెగా స్టార్ గా ఎదిగాడు.

also read:

Visitors Are Also Reading