Telugu News » Blog » బాలకృష్ణ క్యారెక్టర్ గురుంచి నిజాలు చెప్పిన ఆయన చిన్నల్లుడు..నా భార్యకు నచ్చవంటూ..?

బాలకృష్ణ క్యారెక్టర్ గురుంచి నిజాలు చెప్పిన ఆయన చిన్నల్లుడు..నా భార్యకు నచ్చవంటూ..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. 6 పదుల వయసులో కూడా ఒక యంగ్ హీరో లాగా ఇంకా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రోజురోజుకు పేరు సంపాదించు కుంటున్నారు. ఇక బాలయ్య సీనియర్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలు ఉన్నాయి.. కానీ ఆ మధ్యకాలంలో కాస్త డౌన్ ఫాల్ అయిన మళ్లీ అఖండ సినిమా తర్వాత దూసుకుపోతున్నారు. అలాంటి బాలయ్య గురించి చిన్న కూతురు తేజస్విని భర్త భరత్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.

Advertisement

also read:ఇడ్లీ ఫస్ట్ ఎక్కడ పుట్టిందో తెలుసా ? 

 

బ్రాహ్మణి, తేజస్విని నాకు చిన్నప్పటి నుంచి తెలుసని అన్నారు. మా అత్తమ్మ వసుంధర, మా అమ్మ ఒకే స్కూల్లో చదివారని అన్నారు. వీరు ప్రతినెలా కలిసే వారని పేర్కొన్నారు. బ్రాహ్మణితో ఎక్కువ పరిచయం ఉండేదని భరత్ చెప్పుకొచ్చారు. నేను పై చదువుల కోసం అమెరికా వెళ్లానని, నా పెళ్లి ప్రస్తావన వచ్చిన టైంలో మా పెద్దమ్మ రెండు కుటుంబాలతో మాట్లాడి పెళ్లి సెట్ చేశారని తెలిపారు. నాకు 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి జరిగిందని అన్నారు.

Advertisement

also read:ఈ సీజన్ లో లభించే సపోటా పండ్లను తింటున్నారా ? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన చిన్న పిల్లల మనస్తత్వం కలిగినవారని, ఫ్రీగా మాట్లాడతారని భరత్ అన్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు తేజస్విని చాలా సపోర్ట్ చేసిందని తెలియజేశారు. కానీ నా భార్యకు రాజకీయాలంటే అస్సలు నచ్చవని అన్నారు. ఇక రాబోవు ఎన్నికల్లో భరత్ పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్టు కనబడుతోంది.

Advertisement

also read:ఓటీటీ నుంచి ‘రానా నాయుడు’ ఔట్.. అందుకోసమేనా..?

You may also like