Home » మహేష్ బాబు అక్క మంజుల గురించి ఓ రహస్యాన్ని బయటపెట్టిన నమ్రత..తెలిస్తే షాకే.!!

మహేష్ బాబు అక్క మంజుల గురించి ఓ రహస్యాన్ని బయటపెట్టిన నమ్రత..తెలిస్తే షాకే.!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇందులో కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ సూపర్ స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు.. అయితే మహేష్ బాబు భార్య నమ్రత ఈ మధ్య కాలంలో ఒక రహస్యాన్ని బయటపెట్టింది.. అది ఎవరి గురించి అంటే మహేష్ బాబు అక్క మంజుల గురించి.. మరి రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఘట్టమనేని వారి కోడలు హీరోయిన్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఒకటి,రెండు సినిమాల్లో నటించి మహేష్ బాబుతో ప్రేమలో పడింది నమ్రత. చివరికి వివాహం చేసుకొని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. నటనకు దూరం అయినా కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటూ అభిమానులందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన లైఫ్ లో జరిగినటువంటి ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Advertisement

ALSO READ;ఎన్టీఆర్ త‌న త‌మ్ముడు త్రివిక్ర‌మ్ రావును ఎందుకు దూరం చేసుకున్నారు..? ఆ త‌ప్పు వ‌ల్లేనా..?

Advertisement

ఈ మధ్యకాలంలో నమ్రత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబానికి సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. అది ఎవరిదో కాదు మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని విషయం. అది ఏంటంటే మహేష్ బాబు నమ్రత ప్రేమలో ఉన్నప్పుడు లవ్ విషయం ఇంట్లో వారికి తెలియక ముందే, నమ్రత, మంజులని కామన్ గా ఒక పెళ్లిలో కలిసిందని, ఇక అప్పటి నుంచి వీరు మంచి స్నేహితులు అయ్యారని చెప్పుకొచ్చింది. వివాహం జరిగి ఇన్ని సంవత్సరాలైనా ఇద్దరం ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉంటామని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంలోనే మంజులకు పెళ్లయిన తర్వాత ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉంటే తనకి పిల్లల్ని కనడంలో ఇంట్రెస్ట్ లేదని, పిల్లలంటే ఇష్టం ఉండదని చెప్పిందట మంజుల. కానీ అనుకోకుండానే మంజుల మరియు నమ్రతలు ఒకేసారి ప్రెగ్నెంట్ అవ్వడం, పిల్లలు పుట్టడం జరిగిందని తెలియజేసింది. అప్పట్లో అయితే పిల్లల విషయంలో వెనక ముందు ఆలోచించిన మంజుల ఇప్పుడు తన కూతురుతో ప్రతిక్షణం ఎంజాయ్ చేస్తూ ప్రేమగా ఉంటుందనే విషయాన్ని బయట పెట్టింది. అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ;

Visitors Are Also Reading