Home » ఎన్టీఆర్ త‌న త‌మ్ముడు త్రివిక్ర‌మ్ రావును ఎందుకు దూరం చేసుకున్నారు..? ఆ త‌ప్పు వ‌ల్లేనా..?

ఎన్టీఆర్ త‌న త‌మ్ముడు త్రివిక్ర‌మ్ రావును ఎందుకు దూరం చేసుకున్నారు..? ఆ త‌ప్పు వ‌ల్లేనా..?

by AJAY
Ad

అన్న‌దమ్ములు అంటే రామ‌ల‌క్ష్మ‌ణుల్లా ఉండాల‌ని వారిని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ రియాలిటీ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. చాలా మంది అన్న‌ద‌మ్ములు ఆస్తుల కోసం గొడ‌వ‌లు ప‌డుతూ ఉంటారు. భూముల కోసం సొంత అన్న‌ద‌మ్ములే ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకుంటూ ఉంటారు. కానీ అన్న‌గారు ఎన్టీఆర్ ఆయన సోద‌రుడు త్రివిక్ర‌మ్ రావు కూడా రామ‌ల‌క్ష‌ణుల మాదిరిగా క‌లిసి మెలిసి ఉండేవారు.

Advertisement

ఎన్టీఆర్ త‌న సోద‌రుడిని ఎంతో ప్రేమ‌గా చూసుకునేవారు. త్రివిక్రమ్ రావు కూడా ఎన్టీఆర్ సినిమా వ్య‌వ‌హారాల‌న్ని ద‌గ్గ‌రుండి చూసుకునేవారు. ఎన్టీఆర్ సినిమాకు త్రివిక్ర‌మ్ రావ్ ద‌గ్గ‌రుడి క్లాప్ కొట్టాల్సిందే అదే సెంటిమెంట్. ఎన్టీఆర్ డేట్స్ కూడా త్రివిక్ర‌మ్ రావు చూసుకునేవారు. కేవ‌లం సినిమాలకు సంబంధించిన వ్య‌వ‌హ‌రాలు మాత్ర‌మే కాకుండా ఎన్టీఆర్ ఉద‌యం లేచిన‌ప్ప‌డి నుండి ఆయ‌న రోజూ వారి కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన విష‌యాల‌ను త్రివిక్ర‌మ్ రావు దగ్గ‌రుండి ప్లాన్ చేసేవారు.

Advertisement

త్రివిక్ర‌మ్ రావు సొంత బ్యాన‌ర్ ను స్థాపించి సినిమాల‌ను నిర్మించేవారు. ఎన్టీఆర్ తోనే త్రివిక్ర‌మ్ రావు ఎక్కువ సినిమాల‌ను నిర్మించారు. ఒకానొక సంధ‌ర్బంలో త్రివిక్ర‌మ్ రావు న‌ష్టాల‌ను చూశారు. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్ అండ‌గా నిల‌బ‌డి ఆర్థింగా ఆదుకున్నారు. ఎన్టీఆర్ ముందుండి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పితే రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌న్ని త్రివిక్ర‌మ్ రావు వెన‌కుండి చూసుకునేవారు. అలా ఎంతో క‌లిసి మెలిసి ఉండే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఒకానొక సంధ‌ర్బంలో దూరం అయ్యారు.

తెలుగుదేశం పార్టీ త‌ర‌పున త్రివిక్ర‌మ్ రావు కార్య‌క‌ర్త‌ల కోసం కొంద‌రి వ‌ద్ద ఫండ్ ను సేక‌రించార‌ట‌. అయితే త‌న‌కు తెలియ‌కుండా పార్టీ ఫండ్ ను ఎందుకు సేక‌రించార‌ని ఎన్టీఆర్ కోపంతో త్రివిక్ర‌మ్ రావు తో మాట్లాడ‌లేదట‌. ఆ త‌ర‌వాత ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింది. త్రివిక్ర‌మ్ రావు కుమారులు హీరోలు గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఎన్టీఆర్ స‌పోర్ట్ చేయ‌లేదు. కానీ ఎన్టీఆర్ చివ‌రి రోజుల్లో అన్న‌ద‌మ్ములిద్ద‌రూ మ‌ళ్లీ క‌లిసిపోయారు.

ALSO READ : హీరోయిన్స్ విష‌యంలో అక్కినేనికి, ఎన్టీఆర్ కి ఎంత తేడా ఉంటుందో తెలుసా..?

Visitors Are Also Reading