Home » విడాకుల తరువాత ఫస్ట్ టైమ్ సమంత గురించి మాట్లాడిన నాగార్జున.. ఎందుకోసమంటే..?

విడాకుల తరువాత ఫస్ట్ టైమ్ సమంత గురించి మాట్లాడిన నాగార్జున.. ఎందుకోసమంటే..?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా క్రేజ్ ఉన్న ఈ కుటుంబానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంటి కోడలుగా అడుగుపెట్టారు. నాగచైతన్య-సమంత కొంత కాలం ప్రేమించుకున్న తరువాత పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 

Advertisement

 

పెళ్లి జరిగిన కొద్ది కాలం వీరి జీవితం సాఫీగానే సాగినప్పటికీ.. అకస్మాత్తుగా ఏమైందో ఏమో తెలియదు కానీ విడాకులు ప్రకటించుకున్నారు. వీరు విడాకులు తీసుకుంటున్నారని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి వీరి గురించి ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంది. నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్న సమయంలో వీరి విడాకుల గురించి నాగార్జున స్పందిస్తూ.. వారి నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పుకొచ్చారు. అదేవిధంగా సమంత ఎక్కడ ఉన్నా మంచిగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు నాగార్జున.  దీంతో అప్పట్లో అభిమానులు నాగార్జునని పొగడ్తలతో ముంచెత్తారు. 

Advertisement

ఇక అప్పటి ఆ క్షణం నుంచి ఇప్పటివరకు కూడా నాగార్జున సమంత  గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సమంత మయోసైటిస్ అనే వ్యాధి భారిన పడినప్పటికీ.. సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. కానీ  తొలిసారి నాగార్జున సమంత గురించి ప్రశ్నించారు. సమంత గురించి నాగార్జున ఇప్పుడు మాట్లాడటానికి కారణం ఏంటంటే..? కొద్ది గంటల్లోనే బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ రావడంతో మీ హీరోయిన్ సమంత ఎక్కడ అని.. తన మాజీ కోడలు గురించి నాగార్జున ప్రశ్నించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.  సమంత ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

కమల్ హాసన్ “విక్రమ్” సినిమాలో ఆఫర్ ని లారెన్స్ ఎందుకు రిజెక్ట్ చేసాడు?

Prabhas : లీక్ అయిన ప్రభాస్ ఆధార్ కార్డు.. ఇందులో ఏమి ఉందో తెలిస్తే షాక్ అవుతారు!

Visitors Are Also Reading