Home » కమల్ హాసన్ “విక్రమ్” సినిమాలో ఆఫర్ ని లారెన్స్ ఎందుకు రిజెక్ట్ చేసాడు?

కమల్ హాసన్ “విక్రమ్” సినిమాలో ఆఫర్ ని లారెన్స్ ఎందుకు రిజెక్ట్ చేసాడు?

by Srilakshmi Bharathi
Ad

కొరియోగ్రాఫర్ నుండి నటుడు-దర్శకుడు గా ఎదిగిన లారెన్స్ తాజాగా హర్రర్ డ్రామా చంద్రముఖి 2 లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో లారెన్స్ పలు మీడియా సంస్థలతో ఇంటరాక్ట్ అవుతూ ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Advertisement

కమల్ హాసన్ యొక్క విక్రమ్ చిత్రంలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి పోషించిన సంతానం పాత్ర కోసం దర్శకుడు లోకేష్ కనకరాజ్ మొదటగా తనకు ఆఫర్ ఇచ్చినట్లు లారెన్స్ తెలిపారు. అయితే ఈ ఆఫర్ ను తానూ రిజెక్ట్ చేసానని.. ఎందుకంటే సంతానం పాత్ర కోసం రాసుకున్న హింసాత్మక సన్నివేశాలు అటు కుటుంబ ప్రేక్షకులు, ఇటు చిన్న పిల్లలు చూడలేరని, అందుకే ఈ ఆఫర్ ని తిరస్కరించినట్లు లారెన్స్ పేర్కొన్నాడు.

Advertisement

అయితే, లారెన్స్ త్వరలో ప్రారంభం కానున్న ప్రాజెక్ట్ కోసం లోకేష్ కనగరాజ్‌తో జతకట్టనున్నాడు. ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్‌ప్లే బాధ్యతలు లోకేష్ తీసుకుంటున్నారు ఆయనకు ఎప్పుడు సహకరించే అయితే, లారెన్స్ త్వరలో ప్రారంభం కానున్న ప్రాజెక్ట్ కోసం లోకేష్ కనగరాజ్‌తో జతకట్టనున్నాడు. ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్‌ప్లే లోకేష్ పర్యవేక్షణ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కానున్నందని తెలుస్తోంది.

మరిన్ని..

Viswak sen: విశ్వక్ సేన్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య.. సెట్ లోకి వచ్చి..?

Srikanth : రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్..!

Prabhas : లీక్ అయిన ప్రభాస్ ఆధార్ కార్డు.. ఇందులో ఏమి ఉందో తెలిస్తే షాక్ అవుతారు!

Visitors Are Also Reading