Home » అన్ స్టాపబుల్ కు చిరు ప్రెసెంట్.. నాగ్ అప్సెంట్..!

అన్ స్టాపబుల్ కు చిరు ప్రెసెంట్.. నాగ్ అప్సెంట్..!

by Azhar
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల విషయంలో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇదే సమయంలో ఆయన ఆహ ఓటీటీలో చేస్తున్న అన్ స్టాపబుల్ అనే షో కూడా ఎంతో పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ లో ఈ షో కు చాలా మంది పెద్ద పెద్ద హీరోలు వచ్చారు. అయితే ఈ షోను బాలకృష్ణ చిరంజీవితో ప్రారంభం అవుతుంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

Advertisement

ఇక ఈ మధ్యే అన్ స్టాపబుల్ రెండో సీజన్ కూడా ప్రారంభం అయ్యింది. ఇక ఇందులో మొదటి ఎపిసోడ్ లోనే నారా చంద్రబాబు నాయుడు రావడం అనేది పెద్ద హైప్ ను క్రియేట్ చేసింది. అయితే ఈ హైప్ ను అలానే ఉంచాలి అనే ఉద్దేశంలో.. చిరంజీవిని ఈసారి అన్ స్టాపబుల్ షో కు ఆహ్వానించగా ఆయన ఒప్పుకున్నారు అని తెలుస్తుంది.

Advertisement

అయితే బాలయ్యతో అన్ స్టాపబుల్ కు కేవలం చిరును ఒక్కడినే కాకుండా మెగాస్టార్ తో పాటుగా నాగార్జునను కూడా రప్పించాలని అనుకున్నారట. కానీ చిరు ఎస్ చెప్పిన అన్ స్టాపబుల్ కు నాగ్ నో చెప్పాడు అని తెలుస్తుంది. అయితే బాలయ్యకు నాగ్ కు మధ్య కొన్ని బెధభిప్రాయాలు ఉన్నాయని.. అందుకే నాగార్జున నో చెప్పాడు అని తెలుస్తుంది. అయితే చిరు వచ్చే ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి :

ఏ జట్టును ఎలా ఓడించాలో నాకు తెలుసు..!

పోయినసారి మ్యాచ్ తర్వాత.. ఇప్పుడు మ్యాచ్ కంటే ముందే..?

Visitors Are Also Reading