Home » బిగ్ బాస్ షో నుంచి నాగార్జున అవుట్.. కొత్త హోస్ట్ ఎవరో అస్సలు ఊహించి ఉండరు..!

బిగ్ బాస్ షో నుంచి నాగార్జున అవుట్.. కొత్త హోస్ట్ ఎవరో అస్సలు ఊహించి ఉండరు..!

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు ప్రేక్షకుల ఫెవరేట్ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అత్యంత ప్రజాధారణతో సక్సెస్ ఫుల్ గా ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకుంది ఈ షో. ప్రస్తుతం 7వ సీజన్ లోకి అడుగుపెట్టబోతుంది. ఈ సీజన్ కి సంబంధించి బిగ్ బాస్ టీమ్ ఇప్పటికే అప్డేట్స్ ఇవ్వడం కూడా స్టార్ చేశారు. గత షోలకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జుననే ఈ షోకి కూడా హోస్ట్ గా చేయబోతున్నట్టు ప్రోమోస్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా రెపో మాపో ఈ షో కూడా  ప్రారంభం అవ్వబోతుందనగా బిగ్ బాష్ టీమ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ షోకి నాగార్జున హోస్ట్ గా చేయబోవడం లేదనే వార్త వినిపిస్తోంది. 

Advertisement

బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ వ్యవహరించారు. ఇక ఆ తరువాత సెంకడ్ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశాడు. అప్పటి నుంచి అనగా మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జుననే ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గత కొద్ది కాలంగా బిగ్ బాస్ షోలో నాగార్జున హోస్టింగ్ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఆయనను తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. యాంకర్ ని మార్చాల్సిందిగా ప్రేక్షకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయితే వేరే సెలబ్రెటిలే వారు ఈ షోకు యాంకరింగ్ చేయడానికి ఇష్టపడకపోవడంతో నాగార్జునే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. 

Advertisement

Ramya krishna

ఈ ఏడో సీజన్ కి మాత్రం నాగార్జున కొద్ది రోజులు మాత్రమే హోస్ట్ చేస్తాడనే వార్త గట్టిగానే వినిపిస్తోంది. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా జరిగిందట. దాదాపు 3 నెలల పాటి జరిగే ఈ షో ఫస్ట్ నెల మాత్రమే నాగార్జున చేస్తాడట. ఇక ఆ తరువాత యాంకర్ మారుతాడని టాక్ వినిపిస్తోంది. ఆ కొత్త యాంకర్ ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ నిర్ణయం తీసుకున్నది కూడా స్వయంగా నాగార్జుననే అని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అఫిషియల్ గా ప్రకటన వచ్చే అవకాశముంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. రమ్యకృష్ణ హోస్ట్ గా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందనేది కొద్ది రోజులు వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన యాంక‌ర్ నే పెళ్లి చేసుకున్న బిచ్చ‌గాడు హీరో…అత‌డి జీవితంలో ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా..?

పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్…!

Visitors Are Also Reading