Home » ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన యాంక‌ర్ నే పెళ్లి చేసుకున్న బిచ్చ‌గాడు హీరో…అత‌డి జీవితంలో ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా..?

ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన యాంక‌ర్ నే పెళ్లి చేసుకున్న బిచ్చ‌గాడు హీరో…అత‌డి జీవితంలో ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా..?

by AJAY
Ad

త‌మిళ హీరో విజయ్ ఆంటోనీ తన నటనతో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుకున్నారు. తెలుగులో బిచ్చ‌గాడు సినిమాతో విజ‌య్ ఆంటోనికి చాలా మంది అభిమానులు అయ్యారు. ఆ త‌ర‌వాత త‌న సినిమాల‌న్నీ తెలుగులో డ‌బ్ చేయ‌డం మొద‌టు పెట్టాడు. ఇక సినిమాల్లో ఎంతో స‌క్సెస్ అయిన విజ‌య్ జీవితంలో ఎన్నో క‌ష్టాలు ఉన్నాయి. చిన్న వయసులోనే తండ్రిని కల్పోయి, తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు ఎదురుకున్నాడు. మొదటగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా సినీ ప్రపంచంలో అడుగుపెట్టి నటుడుగా. సినిమా ఎడిటర్ గా నిర్మాతగా సినీ ప్రపంచంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు.

ఇవి కూడా చదవండి: నాగార్జున ఎంతో ఇష్టంగా న‌టించిన సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అని మీకు తెలుసా..?

Advertisement

ఇక ప్ర‌స్తుతం హీరోగా బిజీగా ఉన్నాడు. విజ‌య్ తండ్రి మరణించే నాటికి ఆయ‌న‌కు కేవ‌లం ఏడు సంత్సరాలు మాత్ర‌మే ఉన్నాయి. తన చెల్లి వయసు నాలుగు సంత్సరాలు మాత్రమే కాగా ఆయ‌న త‌ల్లి ఉద్యోగం చేస్తు పిల్లలను చదివించేది. ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చినా పిల్లల చదువు దెబ్బతింటుందని ఉన్న‌ చోటునుండే దూర ప్రయాణం చేసేది. ఆంటోనీ లాయోల కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చ‌దువుకున్నాడు. ఆ తరువాత సౌండ్ ఇంజనీర్ గా విద్యనభ్యసించాడు.

Advertisement

ఇవి కూడా చదవండి: సీనియ‌ర్ ఎన్టీఆర్ ఆ స్టార్ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డి రెండో పెళ్లి చేసుకోవాల‌నుకున్నారా..?

తన తల్లి ఉద్యోగ రీత్యా శిక్షణా తరగతులకు వెలల్సి వచ్చింది. దాంతో ఆంటోనిని హాస్టల్ లో చేర్పించి , తనతో పాటు కూతురును తీసుకువెళ్లింది. అంతేకాదు హాస్టల్ లో ఉన్నప్పుడు అనుకోకుండా రెండు రోజులు సెలవులు వచ్చాయని అప్పుడు తన వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్థుల శిబిరంలో తల దాచుకున్నాన‌ని విజ‌య్ ఓ ఇంట‌ర్యూలో తెలిపారు.

ఆ సమయంలో తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదని కేవలం అరటి పండు తింటూ జీవనం సాగించానంటూ తాను ప‌డిన‌ కష్టాల గురించి చొప్పుకొచ్చారు. సినిమాల‌పై ఆస‌క్తితో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి “నాన్” 2012 అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఆ త‌ర‌వాత న‌టించిన సలీం సినిమాతో విజ‌య్ అంటోనికి గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకున్నాడు. అంతేకాకుండా విజయ్ వివాహం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఫాతిమా అనే ఒక జర్నలస్టు విజయ్ ని ఇంటర్వూ చేయడానికి రాగా ఆమెతో ప్రేమలో పడి 2006 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు . వీరికి లారా అనే కూతురు కూడా ఉంది.

ఇవి కూడా చదవండి: వెంకీ మామ కొడుకు అర్జున్ ద‌గ్గుబాటి ఎంత అందంగా ఉన్నాడో చూశారా..? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

Visitors Are Also Reading