Home » ఏ హీరోకు సాధ్యం కానీ ప్ర‌పంచ రికార్డు సృష్టించిన నాగార్జున‌..!

ఏ హీరోకు సాధ్యం కానీ ప్ర‌పంచ రికార్డు సృష్టించిన నాగార్జున‌..!

by Anji
Ad

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున గురించి ఇక ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అక్కినేని న‌ట వార‌సుడిగా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా రాణించారు. హీరోగా 36 న‌ట ప్ర‌స్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఇక ఈ ఏడాది బంగార్రాజు, బ్ర‌హ్మాస్త్ర సినిమాల‌తో ప‌లుక‌రించిన ఈయ‌న త్వ‌ర‌లో దిఘోస్ట్ సినిమాతో ఆడియ‌న్స్ ముందుకు రానున్నారు. నాగార్జున మాత్ర‌మే సాధ్య‌మైన అరుదైన రికార్డు.. ప్ర‌పంచంలోనే ఏ హీరోకి కూడా సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఇంత‌కి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఒకే హీరోయిన్ తండ్రి కొడుకుల స‌ర‌స‌న యాక్ట్ చేయ‌డం చాలా రేర్ అనే చెప్పాలి. తెలుగు, హిందీ, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో తండ్రి స‌ర‌స‌న న‌టించిన హీరోయిన్లు చాలా మంది కొడుకుల స‌ర‌స‌న న‌టించారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించిన జ‌య‌సుధ‌, ర‌తి అగ్ని హోత్రి, రాధ ఆయ‌న కొడుకు బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌టించారు. అదేవిధంగా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన శ్రీ‌దేవి, రాధ‌, ర‌మ్య‌కృష్ణ‌ల‌తో ఆయ‌న త‌న‌యుడు నాగార్జున‌కి జోడిగా న‌టించారు. నాగార్జున విష‌యానికి వ‌స్తే తండ్రి ఏఎన్నార్ స‌ర‌స‌న న‌టించిన హీరోయిన్ల‌తో పాటు కొడుకు నాగచైత‌న్య‌కి జోడిగా న‌టించిన లావ‌ణ్య త్రిపాఠితో సొగ్గాడే చిన్ని నాయ‌నా సినిమా చేశారు. అదేవిధంగా చైతూ స‌ర‌స‌న రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో న‌టించిన ర‌కుల్ ప్రీత్‌సింగ్ తో కలిసి మ‌న్మ‌థుడు సీక్వెల్ గా తెర‌కెక్కిన మ‌న్మ‌థుడు 2లో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Advertisement

 Also Read : ద‌గ్గుబాటి త‌న‌యుడిని మ‌ళ్లీ టార్గెట్ చేసిన శ్రీ‌రెడ్డి.. కామెంట్స్ వైర‌ల్‌..!

NAGARJUNA

NAGARJUNA

ఇక ఈ రకంగా అటు తండ్రి ఏఎన్నార్ స‌ర‌స‌న న‌టించిన హీరోయిన్స్‌తో పాటు ఇటు త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌కు జోడిగా న‌టించిన భామ‌ల‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై జోడీగా న‌టించిన ఏకైక హీరోగా నాగార్జున రికార్డుల‌కు ఎక్కాడు. ఇక నాగార్జున వ‌లే ఎన్టీఆర్ త‌నయుడిగా ఇండ‌స్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన బాల‌కృష్ణ ఈ రికార్డు అందుకోలేదు. మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టికే ఖైదీ నెంబ‌ర్ 150లో కాజ‌ల్‌తో క‌లిసి న‌టించారు. రామ్ చ‌ర‌ణ్ కూడా కాజ‌ల్‌తో క‌లిసి మ‌గ‌ధీర, గోవిందుడు అంద‌రివాడులే వంటి సినిమాల్లో న‌టించారు. చిరంజీవి కూడా రామ్ చర‌ణ్ న‌టించిన హీరోల‌తో న‌టిస్తే రికార్డు బ్రేక్ చేయ‌వ‌చ్చు. ఇక ఏది ఏమైనా ఇక ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌లో ఏ హీరోకి సాధ్యం కాని ఈ అరుదైన రికార్డు కేవ‌లం నాగార్జున‌కే సాధ్యం అని చెప్పాలి. ఈ రికార్డును ముందు ముందు ఎవ‌రైనా బ్రేక్ చేస్తారేమో వేచి చూడాలి మ‌రి.

Also Read :  ప్రభాస్ గోపీచంద్ హీరోలుగా పూరీ దర్శకత్వంలో రావాల్సిన క్రేజీ మల్టీ స్టారర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా…?

 

Visitors Are Also Reading