Home » ద‌గ్గుబాటి త‌న‌యుడిని మ‌ళ్లీ టార్గెట్ చేసిన శ్రీ‌రెడ్డి.. కామెంట్స్ వైర‌ల్‌..!

ద‌గ్గుబాటి త‌న‌యుడిని మ‌ళ్లీ టార్గెట్ చేసిన శ్రీ‌రెడ్డి.. కామెంట్స్ వైర‌ల్‌..!

by Anji
Ad

ద‌గ్గుబాటీ రాణా త‌న‌యుడు అభిరామ్ అహింస అనే సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మవుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవలే శ్రీ‌రెడ్డి కాస్టింగ్ కౌచ్ పేరుతో అభిరామ్ ని టార్గెట్ చేసి నానా హంగామా చేసింది. ముఖ్యంగా అభిరామ్ త‌న‌కు హీరోయిన్‌గా ఛాన్స్‌లు ఇప్పిస్తాన‌ని చెప్పి త‌న‌ను వాడుకొని వ‌దిలేశాడని చెప్ప‌డంతో పాటు అత‌నితో చ‌నువుగా ఉన్న ఫోటోల‌ను బ‌హిర్గ‌తం చేసి పెద్ద సంచ‌ల‌న‌మే సృష్టించింది శ్రీ‌రెడ్డి. అభిరామ్ ఒక్క సినిమా కూడా చేయ‌కుండా పుల్ పాపుల‌ర్ అయిపోయాడు.


అభిరామ్ సినిమాకి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ విడుదల కాగా..తాజాగా ఈ సినిమాలో న‌టిస్తున్న పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కుడు తేజ స‌రికొత్త‌గా ప‌రిచ‌యం చేశారు. ముఖ్య పాత్ర‌ల వాయిస్‌ల‌ను వినిపిస్తూ పోస్ట‌ర్లు విడుద‌ల చేశారు. అదేవిధంగా సినిమాలో ఆ పాత్ర‌లు చెప్పిన డైలాగ్స్‌ని ఆ పోస్ట‌ర్స్‌కి జ‌త చేసి ఈ చిత్ర బృందం ఒక డైలాగ్ పోస్ట‌ర్ ప్రోమో విడుద‌ల చేసింది.ఈ చిత్రంలో ర‌ఘు అనే కుర్రాడి పాత్ర పోషిస్తుండ‌గా.. హీరోయిన్ గీతిక అహ‌ల్య పాత్ర‌లో క‌నిపిస్తోంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. శ్రీ‌రెడ్డి త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న కామెంట్లు చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

Advertisement

Also Read :  Kamal Haasan : సింగిల్ టేక్‌లోనే.. 10 నిమిషాల డైలాగ్ 14 భాష‌ల్లో..!


ఇటీవ‌ల అభిరామ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. న‌టుడిగా త‌న‌కు మంచి ల‌వ్‌స్టోరీ చేయాల‌ని ఉంద‌ని చెప్పుకొచ్చాడు. ల‌వ్‌స్టోరీలో మంచి కంటెంట్ తో స‌హా మెసెజ్ కూడా ఉండాలని కోరిక‌. ప్ర‌స్తుతం చేస్తున్న అహింస సినిమాలో మంచి కంటెంట్ ఉంద‌ని.. ఆ సినిమా చూసిన త‌రువాత మీరే అస‌లు విష‌యాన్ని ఒప్పుకుంటార‌ని వెల్ల‌డించారు. ఈ సినిమాలో గ‌త జీవితాన్ని ఓపెన్ చేసి చూపించిన‌ట్టు జ‌నం ఫీల్ అవుతార‌ని, ఈ సినిమా ద్వారా నాలాంటి వారు ఎవ‌రైనా ఉంటే వాళ్ల జీవితాల‌ను మార్చుకోవ‌చ్చు అని చెప్పుకొచ్చాడు అభిరామ్‌.

Also Read :  ఆస్కార్ రేసులో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్.. ఖుషీ అవుతోన్న అభిమానులు..!

Visitors Are Also Reading