Home » ఎంఎస్ నారాయణ రైటర్ నుంచి కమెడియన్ గా మారడానికి కారణాలు ఏంటో మీకు తెలుసా..?

ఎంఎస్ నారాయణ రైటర్ నుంచి కమెడియన్ గా మారడానికి కారణాలు ఏంటో మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మైలవరపు సూర్యనారాయణ అంటే మీకు ఎవరో తెలియకపోవచ్చు కానీ ఎమ్మెస్ నారాయణ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుండే పేరు. ఈయన పేరు తలచుకోగానే పెదవులపై నవ్వు విరాజిల్లుతుంది. అలా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు ఎమ్మెస్ నారాయణ. ఎమ్మెస్ నారాయణది పోరాడే తత్వం. ఆయన చిత్ర పరిశ్రమలోకి రాకముందు లెక్చరర్ గా పనిచేశారు. తర్వాత ఇండస్ట్రీలోకి రైటర్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హాస్య నటుడిగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాడు. రచయితలు హాస్యనటులు అయితే వారిలో నటనను మరింత మెరుగుపరిచి చక్కగా ప్రజెంట్ చేయగలరు. ఎమ్మెస్ నారాయణ గారు ఏ సన్నివేశం అయినా సరే ఎంతో బాగా ఇంప్రెస్ చేసేవారు. అందుకే ఆయన చేసిన ప్రతి సీన్ ఎంతో బాగా పండేది.

ఎమ్మెస్ నారాయణ కు దాదాపుగా 20 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో అనుభవం ఉంది.700 కు పైగా చిత్రాల్లో నటించారు. ఇన్ని సినిమాల్లో నటించడం కేవలం ఆయన నటనా చాతుర్యం వల్లనే సాధ్యమైంది. సంవత్సరానికి దాదాపు 30 నుంచి 35 సినిమాలలో నటించే వారు. పెద్ద పెద్ద రికార్డును తన సొంతం చేసుకున్నారు ఎమ్మెస్ నారాయణ సినీ పరిశ్రమకు చాలా ఆలస్యంగా వచ్చారనే చెప్పాలి. ఆయన 44 వ సంవత్సరంలో చిత్ర రంగంలో అడుగుపెట్టారు. అది కూడా రచయితగా మాత్రమే. ఆయన కొత్తగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు నా కథలు వినండి అంటూ సైట్లలో తిరుగుతూ ఎంతో మంది నిర్మాతలను కలిశారు.

Advertisement

Advertisement

అది చూసిన కో-డైరెక్టర్ ఇలా సైకిల్ మీద వస్తే సినీ పరిశ్రమ గౌరవించదు. ఆటోలో అయినా రండి లేదంటే నడుచుకుంటూ రండి కానీ సైకిల్ మీద మాత్రం రాకండి అంటూ సలహా ఇచ్చారట. ఇలా కొంతకాలం తర్వాత ఎమ్మెస్ నారాయణ కథ వినడానికి రవిరాజా పినిశెట్టి గారు సహకరించారట. ఎమ్మెస్ నారాయణ కథ చెప్పిన తీరు రవిరాజా పినిశెట్టిని ఎంతో బాగా ఆకర్షించింది. ఈ కథను నేను తీసుకుంటాను దీనికి ఎంత ఇవ్వమంటారు అని రవిరాజా పినిశెట్టి ఎమ్మెస్ నారాయణ గారిని అడిగారట. ఎంత అమౌంట్ అడగాలో తెలియక నారాయణ అలా ఉండిపోయారు. ఆ కథకు రవిరాజా పినిశెట్టి 50 వేల రూపాయలు ఆయనకు ఇచ్చారు. ఈ విధంగా ఎమ్మెస్ నారాయణ అనేక కథలు అందించారట.

ఇంత కష్టపడి ఆయన కథలు రాసిన చాలా సినిమాల్లో ఆయన పేరు లేకపోవడం చూసి చాలా బాధపడిపోయారట. కథా రచయిత స్థానంలో నా పేరు ఎందుకు వేయడం లేదని ఆవేదన చెందిన రోజులు కూడా ఉన్నాయట. ఇలాంటి అవకతవకలు సినీ పరిశ్రమలో ఎన్నో చూసారు ఎం.ఎస్.నారాయణ. రవిరాజా పినిశెట్టి గారు నీలో మంచి నటుడు ఉన్నాడని గుర్తించి మొట్టమొదటిసారిగా యమధర్మరాజు ఎంఏ సినిమా లో ఒక చిన్న అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని, ఇలా ఆయన నాలుగు సినిమాల్లో సీరియల్ గా నటించానని ఎమ్మెస్ నారాయణ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ విధంగా ఆయన రైటర్ నుంచి హాస్యనటుడిగా మారిపోయారు.

also read;

థాంక్యూ ట్రైల‌ర్ లో ఆ డైలాగ్ ను గ‌మ‌నించారా..? స‌మంతను ఉద్దేశించే చైతూ అంత మాట అన్నాడా..?

ఘనంగా బుల్లితెర నటి వైష్ణవి వివాహం.. వరుడు ఎవరో తెలుసా..?

 

 

 

 

Visitors Are Also Reading