Home » థాంక్యూ ట్రైల‌ర్ లో ఆ డైలాగ్ ను గ‌మ‌నించారా..? స‌మంతను ఉద్దేశించే చైతూ అంత మాట అన్నాడా..?

థాంక్యూ ట్రైల‌ర్ లో ఆ డైలాగ్ ను గ‌మ‌నించారా..? స‌మంతను ఉద్దేశించే చైతూ అంత మాట అన్నాడా..?

by AJAY
Ad

Thankyou Trailer: టాలీవుడ్ లవ్లీ క‌పుల్ స‌మంత నాగ‌చైత‌న్య గ‌తేడాది డిసెంబ‌ర్ లో విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. విడాకులకు కొంత కాలం నుండి వీరిద్ద‌రూ విడిగా ఉంటున్నట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర‌వాత కొంత కాలానికే ఆ మౌనానిని బ్రేక్ చెబుతూ ల‌వ్లీ క‌పుల్ విడాకుల‌ను ప్ర‌క‌టించింది. ఈ వార్త అటు నాగ‌చైత‌న్య అభిమానుల‌ను ఇటు స‌మంత అభిమానుల‌ను షాక్ కు గురిచేసింది. వారిద్ద‌రూ మ‌ళ్లీ క‌ల‌వాల‌ని కోరుకున్నా కూడా అది జ‌ర‌గ‌లేదు.

Advertisement

ఇక ప్ర‌స్తుతం స‌మంత నాగ‌చైత‌న్య ఇద్ద‌రూ వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. స‌మంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, పుష్ఫ సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఖుషి అనే సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమాతో పాటూ స‌మంత చేతిలో ప్ర‌స్తుతం చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. మ‌రోవైపు చైతూ కూడా బంగార్రాజు సినిమాతో హాట్రిక్ హిట్ కొట్టాడు. అమీర్ ఖాన్ తో ఓ బాలీవుడ్ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో క‌లిసి నటించాడు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

Advertisement

samantha-akkineni

samantha-akkineni

అంతే కాకుండా నాగ‌చైత‌న్య రాశీఖ‌న్నా జంట‌గా థాంక్యూ అనే సినిమాలో కూడా క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు విక్ర‌మ్ కే కుమార్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. కాగా ఈ సినిమా ప్రేమ‌కథా చిత్రంగా తెర‌కెక్క‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో చైతూకు రెండు మూడు ల‌వ్ స్టోరీలు ఉండ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ఈ సినిమా టీజ‌ర్ మొద‌ట్లో చైతూ ఓ ఎమోష‌నల్ డైలాగ్ కొట్టాడు.

samantha nagachaithanya

మీరు త‌ప్ప ఇంకెవ‌రూ నా లైఫ్ లో లేరు… అన్నీ వ‌దుల‌కుని ఇక్క‌డికి వ‌చ్చాను. లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యే అవ‌కాశ‌మే లేదు. న‌న్ను నేను స‌రిచేసుకోవ‌డానికి చేస్తున్న ప్రయ‌త్న‌మే ఇది….అంటూ డైలాగ్ కొట్టాడు. కాగా ఈ డైలాగ్ చైతూ నిజజీవితానికి ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉంది. దాంతో స‌మంత‌ను ఉద్దేశించే చైతూ ఈ డైలాగ్ కొట్టాడా.?? అంటూ నెటిజ‌న్లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

ALSO READ :అక్కినేని ఫ్యామిలీలో ఇన్ని జంటలకు విడాకులు అయ్యాయా..? దాని వెనక కారణం అదేనా…!

Visitors Are Also Reading