Home » సౌత్ ఆఫ్రికా క్రికెట్ లీగ్ లో ధోని…?

సౌత్ ఆఫ్రికా క్రికెట్ లీగ్ లో ధోని…?

by Azhar
Ad

వచ్చే ఏడాది నుండి మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో సౌత్ ఆఫ్రికా కూడా తన క్రికెట్ లీగ్ ను ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ కోసం ఏకంగా ఆస్ట్రేలియా పర్యటనను కూడా రద్దు చేసుకున్న సౌత్ ఆఫ్రికా.. దీనిని ఎలాగైనా హిట్ చేయాలనీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. అయితే సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఈ లీగ్ న నిర్వహించడానికి మన ఐపీఎల్ కు సంబంధించిన వ్యక్తులు సహాయం చేస్తున్నారు. ఇక ఆరు జట్లతో ఈ లీగ్ అనేది ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఇందులోని ఆరు జట్లను మన ఐపీఎల్ జట్ల యొక్క ఓనర్లే కొనడం గమనార్హం.

Advertisement

అయితే అక్కడ సౌత్ ఆఫ్రికా లీగ్ లో జట్లను కొన్నవారిలో మన ఐపీఎల్ యొక్క చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా ఉంది. అయితే ఈ లీగ్ ప్రారంభిస్తున్నారు అని తెలిసిన దీనిపైన అంతగా బజ్ లేదు. కానీ ఇందులోని జట్లను మన ఐపీఎల్ జట్ల ఓనర్లు కొన్నారు అని తెలిసిన తర్వాత ఈ లీగ్ పైన కొంత ఆసక్తి అనేది ఏర్పడింది. అయితే ఈ ఆసక్తిని మరింత పెంచడానికి చేనై సూపర్ కింగ్స్ యొక్క యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేంటంటే… ఇక్కడ సౌత్ ఆఫ్రికా క్రికెట్ లీగ్ లో చెన్నై కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనిని ఆడించాలని భావిస్తుంది.

Advertisement

చెన్నై యజమాన్యానానికి… ధోనిని ఉన్న రిలేషన్ గురించి అందరికి తెలుసు. అలాగే ధోని ప్రస్తుతం మన ఐపీఎల్ మినహా.. ఇంకా ఎక్కడ కుడా క్రికెట్ ఆడటం లేదు. అందువల్ల ధోనికి కూడా కొంత ప్రాక్టీస్ లా ఈ లీగ్ ఉంటుంది అని చెన్నై యాజమాన్యం భావిస్తుంది. కానీ ఏ భారత ఆటగాడు అయిన విదేశీ లీగ్స్ లో ఆడాలి అంటే… అతను మన ఇండియాలోని అన్ని రకాల క్రికెట్ కు ఐపీఎల్ ను కూడా కలుపుకొని రిటైర్మెంట్ ఇవ్వాలి. లేదంటే… ఆలా ఆడటానికి కుదరదు. కానీ ఇప్పుడు ధోని ఇంకా ఐపీఎల్ లో ఆడుతున్నాడు. అందువల్ల ధోనిని సౌత్ ఆఫ్రికా లీగ్ లో ఆడటానికి బీసీసీఐ పర్మిషన్ ఇస్తుందా.. లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ నాతో 20 నిముషాలు మాట్లాడు..!

నేనుంటే టీం ఇండియా అన్ని వరల్డ్ కప్స్ గెలిచేది అంటున్న శ్రీశాంత్…!

Visitors Are Also Reading