Home » నేనుంటే టీం ఇండియా అన్ని వరల్డ్ కప్స్ గెలిచేది అంటున్న శ్రీశాంత్…!

నేనుంటే టీం ఇండియా అన్ని వరల్డ్ కప్స్ గెలిచేది అంటున్న శ్రీశాంత్…!

by Azhar
Ad
భారత జట్టు ఇప్పటివరకు నాలుగు ఐసీసీ కప్పులు మాత్రమే విజయం సాధించింది. అందులో రెండు వన్డే వరల్డ్ కప్పులు కాగా.. ఒక్క టీ20 ప్రపంచ కప్ మరో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది భారత జట్టు విజయం సాధించింది. ఇక ఇందులో మొదటి ప్రపంచ కప్ ను కపిల్ దేవ్ సారధ్యంలో గెలిచిన భారత జట్టు మిగిలిన మూడు ఐసీసీ ట్రోఫీలను ధోని కెప్టెన్సీలో విజయం సాధించింది. ఇక ఆ తర్వాత కెప్టెన్ గా వచ్చినా విరాట్ కోహ్లీ సారధ్యంలో ఎన్నో చిరస్మరణీయ సిరీస్ లలో విజయాలు సాధించిన టీం ఇండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు.
ప్రతి ఐసీసీ టోర్నీలో టైటిల్ ఫెవరెట్ గా బరిలోకి దిగే భారత జట్టు సెమిస్ లేదా ఫైనల్ వరకు వెళ్లి వెన్నకి రావడం అనేది చేసింది. ఇక గత ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో అయితే కనీసం సెమీస్ కూడా వెళ్లలేకపోయింది. ఇక ఇలా భారత జట్టు ఎందుకు ఐసీసీ కప్పులు గెలవడం లేదు అని చాలా మంది మాజీలకు ప్రశ్న అనేది ఎదురవుతుంది. ఇక తాజాగా భారత మాజీ పేసర్ శ్రీశాంత్ కు కూడా ఇదే ప్రశ్న అనేది ఎదురైంది. తాజాగా శ్రీశాంత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఈ ప్రశ్న అనేది వచ్చింది. దానికి అతను చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
టీం ఇండియా ప్రపంచ కప్పులు గెలవడకపోవడంలో శ్రీశాంత్ స్పందిస్తూ.. నేను గనక టీం ఇండియాలో ఉంది ఉంటె.. భారత జట్టు 2015, 2019 ప్రపంచ కప్పులతో పాటుగా గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో కూడా విజయం సాధించేది అని పేర్కొన్నాడు . ఇక టీం ఇండియా 2007, 2011 లో సాధించిన రెండు ప్రపంచ కప్ జట్లలో శ్రీశాంత్ ఉన్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత అతనిపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా మళ్ళీ టీం ఇండియాలోగాని.. ఐపీఎల్ లో గాని ఆడే అవకాశం శ్రీశాంత్ కు రాలేదు.

Advertisement

Visitors Are Also Reading