Home » డిజాస్టర్ అవుతుందని కూడా తెలిసి మహేష్ బాబు చేసిన సినిమాలు !

డిజాస్టర్ అవుతుందని కూడా తెలిసి మహేష్ బాబు చేసిన సినిమాలు !

by Bunty
Ad

మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం చెరగని అందంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. తన నటన అందంతో కోట్లాదిమంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టాడు.

super-str-krishna-and-mahesh-babu

super-str-krishna-and-mahesh-babu

అమ్మాయిల కలల రాకుమారుడిగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో సినిమాలను తీశాడు… అందులో చాలా వరకు హిట్ అయ్యి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. అయితే తన కెరీర్లు కొన్ని సినిమాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి.

Advertisement

కొన్ని హిట్ అవుతాయని ఊహించినప్పటికీ ఆ సినిమాలు డిజాస్టర్ గా మారి మహేష్ బాబుకు షాక్ ఇచ్చాయి. ఇక తన కెరియర్ లో రెండు సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతాయి అని తెలిసి కూడా ఆ సినిమాల్లో నటించాడట. సినిమా ఒప్పుకున్నాక ఎలా ఉన్నా చేయాలి కాబట్టి తప్పక ఆ రెండు సినిమాల్లో నటించారట మహేష్ బాబు. మరి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తమిళ దర్శకుడు మురగదాస్ డైరెక్షన్లో వచ్చినటువంటి స్పైడర్ సినిమాలో నటించాడు మహేష్ బాబు. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ సినిమా నటించే సమయంలోనే మహేష్ బాబుకి ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తేడా కొట్టిందట అయినా కూడా నటించక తప్పదు కాబట్టి ఈ సినిమాలో నటించారట.

Advertisement

ఈ సినిమా రిలీజ్ అయ్యి మహేష్ బాబు అనుకున్నట్టుగానే ఫ్లాప్ అయ్యింది. శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చినటువంటి బ్రహ్మోత్సవం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాలో నటించే సమయంలో మహేష్ బాబుకు మధ్యలోనే ఊహించని గట్టి షాక్ తగిలింది. ఈ సినిమా మధ్యలోనే స్క్రిప్ట్ మొత్తం పూర్తి కాలేదని మహేష్ బాబుకు తెలిసింది. ఈ విషయం తెలియగానే స్క్రిప్ట్ అంతా పూర్తయిన తర్వాతనే కదా సినిమాలు ప్రారంభించాలి అని వార్నింగ్ ఇచ్చాడట మహేష్ బాబు. అప్పటికే మహేష్ బాబుకి ఈ సినిమా కూడా హిట్ అవదని అనుకున్నాడట. తాను అనుకున్నట్టుగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.

ఇవి కూడా చదవండి

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Sangeetha: పెళ్లి త‌ర్వాత న‌ర‌కం చూశా.. భ‌ర్తను వదిలేద్దామనుకున్నా..!

భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !

Visitors Are Also Reading