Home » కాకి కాన్సెప్ట్ తో వస్తే సినిమాలు హిట్.. శాస్త్రం ఏం చెబుతుందంటే..?

కాకి కాన్సెప్ట్ తో వస్తే సినిమాలు హిట్.. శాస్త్రం ఏం చెబుతుందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad
 ఇంతవరకు మనం సినిమాల్లో ఎక్కువగా  ఏనుగులు, పులులు, జింకలు లేదంటే పాములు  ఎక్కువగా చూసేవాళ్ళం. అంతేకాకుండా  రామచిలుకలని కూడా చూసాం.  కానీ ప్రస్తుతం పక్షుల్లో కాకి కాన్సెప్ట్ తో సినిమాలు ఎక్కువగా  వస్తున్నాయి. రావడమే కాదు సూపర్ హిట్ కూడా అవుతున్నాయి.  అలా బలగం సినిమా కాకి కాన్సెప్ట్ తోనే  ఉంటుంది. కాకి పిండం ముడితేనే  మంచి జరుగుతుందని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి మూడవ తేదీన వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నది
ఇక వసూళ్ల విషయంలో చరిత్ర సృష్టించింది అని చెప్పవచ్చు. కమెడియన్ దర్శకుడు వేణు తెరకెక్కించిన ఈ మూవీ నటీనటులందరికీ మంచి పేరు తీసుకువచ్చింది. అయితే ఈ సినిమా హిట్ అవడంతో  కొంతమంది దర్శకులు  కాకి కాన్సెప్ట్ ను వాడుకుంటున్నారు. రీసెంట్ గా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్  నటించిన విరూపాక్ష చిత్రంలో కూడా కాకి కాన్సెప్ట్ పెద్దగా ఉంది. క్షుద్ర పూజల నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని హిట్ దిశగా అడుగులు వేస్తోంది.  ప్రేక్షకులను భయపెట్టడం కోసం కాకిని ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు వాడారు.
ముఖ్యంగా క్లైమాక్స్ లో కాకులన్నీ గుంపుగా వచ్చి అగ్నికి ఆహుతి అవ్వడం  అనే కాన్సెప్ట్  కైమాక్స్ లో చాలా బాగుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటీవల విడుదలైన నాని  తొలి పాన్ ఇండియా చిత్రం దసరా సినిమాలో కూడా  ఒక కాకిని వాడేసారు. ఇందులో కాకి పిండాన్ని ముట్టకపోవడం  చూపించారు దర్శకుడు శ్రీకాంత్. ఇక ఈ మూడు చిత్రాలు కాకుల సెంటిమెంట్ తో వచ్చి  సూపర్ హిట్ అయ్యాయి. పూర్వకాలం నుంచి చాలామంది పెద్దలు కాకులను శుభశకునంగా భావిస్తారు. కాబట్టి కాకులను సినిమాల్లో పెట్టడం వల్ల సూపర్ హిట్ అవుతున్నాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Advertisement

Visitors Are Also Reading